Tuesday, October 7, 2014


ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు
అక్టోబర్ 25-26, 2014
(ఉదయం  8 నుండి సాయంత్రం 5 - రెండు రోజులూ)
హ్యూస్టన్, టెక్సస్
సభా ప్రాంగణం: INDIA HOUSE, 8888 W. Bellfort Ave, Houston, TX, 77006
సాదర ఆహ్వానం
ఈ నెలాఖరున అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) రెండు రోజులూ  ఉదయం  8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్ మహా నగరంలో జరుగుతున్న ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు మిమ్మల్ని సకుటుంబ, సపరివారంగా ఆహ్వానిస్తున్నాం. ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు  గడిచిన  సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఆ అర్ధ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన అంశం గా  “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”  నిర్వహించబడుతోంది.  వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ఆధ్వర్యం లో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి & హ్యూస్టన్ సాహితీ లోకం బృందం వారి సమిష్టి నిర్వహణలో ఈ సభలు జరుగుతున్నాయి.  
భారత దేశం నుండి ఆహ్వానిత అతిథులు
తనికెళ్ళ భరణి, పాపినేని శివ శంకర్, జనార్ధన మహర్షి, ముక్తేవి భారతి, ఆకెళ్ళ రాఘవేంద్ర, కస్తూరి అలివేణి, కేతవరపు రాజ్యశ్రీ, ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి (దళిత విశ్వవిద్యాలయం ఉప కులపతి)   “పద్మశ్రీ” యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
అమెరికా ఆహ్వానిత అతిథులు
కిరణ్ ప్రభ, అఫ్సర్, కల్పనా రెంటాల, శారదా పూర్ణ, విన్నకోట రవి శంకర్, ఎస్. నారాయణ స్వామి, గొర్తి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి తదితరులు.
ఆత్మీయ సత్కారాలు
ఉత్తర అమెరికా తొలి కథకులు స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారి కుటుంబ సభ్యులు ( (కెనడా)
అమెరికా తొలి కవి & తొలి తెలుగు పత్రిక సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి కుటుంబం (అట్లాంటా )
అమెరికా తొలి కథా రచయితల జీవన సాఫల్య పురస్కారం
చెరుకూరి రమా దేవి, వేమూరి వెంకటేశ్వర రావు, వేలూరి వెంకటేశ్వర రావు
“అక్కినేని –ఘంటసాల మధుర గీతాలు”
(తొలి రోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి “అపర ఘంటసాల” బాల కామేశ్వర రావు, శారద శాయి, హ్యూస్టన్ గాయని శారద ఆకునూరి, తదితర సుప్రసిద్ధ గాయనీ గాయకుల సంగీత విభావరి” కార్యక్రమం)  

రచయితలకు, వక్తలకు విన్నపం

ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించదల్చుకున్న వారు, స్వీయ రచనా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్నవారూ ఈ క్రింది నిర్వాహకులను సంప్రదింఛండి.ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాషా సాహిత్యాలకి సంబంధించినవే అయి ఉండాలి. అమెరికాలో తెలుగు సాహిత్య పోకడల మీద ప్రసంగాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.

C.N. Satyadev (cnsatyadev@gmail.com), Madhu Pemmaraju (psmadhukumar@gmail.com)

Satybhama Pappu (satyabhama.pappu@gmail.com), Sai Rachakonda (sairacha@gmail.com)

==================================================================================
9 అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు ఉత్తర అమెరికాలో ఇతర నగరాలనుంచీ వచ్చే సాహితీవేత్తలకు మాత్రం ఇబ్బంది లేకుండా, అతి తక్కువ ఖర్చుతో వసతి సదుపాయాలు, వాహన సదుపాయాలు చెయ్యబడ్డాయి. సముచితమైన ఏర్పాట్లు చేయడానికి వీలుగా అమెరికా తెలుగు సదస్సులో పాల్గొన దల్చుకున్నవారు ముందుగా నమోదు చేసుకోవాలి.
SPECIAL DISCOUNTS FOR HOTEL ROOMS
We negotiated special discount rate of only $55 per night for double occupancy at the following Hotel which is less than ten minutes drive from the India House Venue.
Hotel Preet
11050 Southwest Freeway, Houston, TX  77074
Please call Reservations (281 568 6969) and mention “VFA” to receive special room discounts. 
Please contact Ram Cheruvu (ramteja@gmail.com) for airport pick up & transportation.
===========================================================
ఈ సదస్సుకి విచ్చేసిన ప్రతినిధులకి,  సభా ప్రాంగణంలోనూ, మా సాహిత్య కార్యక్రమాలని తమ విరాళాలతో సమర్ధించిన ఇతర సాహితీ ప్రియులందరికీ, మా ఖర్చులతో పోస్ట్ ద్వారానూ ఈ సదస్సులో విడుదల చేయబడుతున్న ఈ క్రింది పుస్తకాలు బహుకరించబడతాయి. ఈ సదస్సు  సందర్భంగా మేము ప్రచురిస్తున్న ప్రత్యేక ప్రచురణల విలువ $145.
1.     “అమెరికాలో తెలుగు కథా సాహిత్యం – ఒక సమగ్ర పరిశీలన”-
50 ఏళ్ల అమెరికా తెలుగు కథ పై సుమారు 300 పేజీల పరిశోధనా గ్రంధం.
రచయితలు: వంగూరి చిట్టెన్ రాజు & తన్నీరు కల్యాణ్ కుమార్
2.    “అమెరికా తెలుగు కథానిక  - 12వ సంకలనం
   34 మంది అమెరికా కథకులు రచించిన రమ్యమైన కథానికా గుళికలు
3.     “ఆత్మార్పణ” – స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి సమగ్ర కవితా సమాహారం.
సంపాదకుడు: విన్నకోట రవి శంకర్
4.    “ఎగిరే  పావురమా” – “నాట్య భారతి” కోసూరి ఉమా భారతి తొలి నవల.   
5.    “ఘర్షణ” - అపర్ణ మునుకుట్ల గునుపూడి కథా సంపుటి–30 కథలు.
=====================================================================
దాతలకు ప్రత్యేక విన్నపం
ఎక్కడ, దేశంలో తెలుగు వారు మనుగడ సాగిస్తున్నారో అక్కడ తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ, తద్వారా మన తెలుగు సంస్కృతినీ ప్రోత్సహించాలనేదే మా అభిలాష. మీరు సదవగాహనతో గత 20 వత్సరాల మా సాహిత్య కృషిని గమనించి, సహృదయంతో స్పందించి, 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నిర్వహణ ఖర్చుల నిమిత్తం తగిన ఆర్ధిక సహాయాన్ని అందించమని అర్థిస్తున్నాం. ఇటువంటి అత్యున్నత సాహిత్య కార్యక్రమాల నిర్వహణలకి మీ ఆర్ధిక సహకారం ఎంతో అవసరం. మీ దాతృత్వమే లాభాపేక్షలేని మా ప్రయత్నాలకి ప్రాణ వాయువు. అందుకే మీకు ప్రత్యేక విన్నపం చేస్తున్నాం. మీ తోడ్పాటు లేనిదే మేమూ ఏమీ చెయ్యలేమని మాకూ, మీకూ తెలినదే!
Suggested Donor Categories
(All donations are tax-deductible in USA. Federal Tax ID : 76-0444238)
(All donors will receive all new VFA publications valued at $145)
All donor names will be prominently displayed at Venue
Grand Event Sponsor: (సార్వభౌమ పోషకులు):  $2500
(Premium seating for six, Two Hotel Rooms,  Special Recognition on Stage)
Grand Sponsor: (చక్రవర్తి పోషకులు) $1000
(Premium seating for four, Two Hotel Rooms, Special Recognition on Stage)
Grand Patron (మహారాజ పోషకులు): $500
(One Hotel Room,  Free Registration for two)
Grand Benefactor (రాజ పోషకులు):  $250
(Free Registration for two persons)
Literary Patrons: (యువ రాజ పోషకులు): $100
(Free Registration for one person
Registration Fee: (సదస్సు నమోదు రుసుము):  $50 per person

How to Register & Donate

ON-LINE

Copy & paste the following link in your URL


OR

Log on to www.vangurifoundation.blogspot.com, click on DONATE button & follow prompts.

OR

Make Check Payable to VFA and mail to
Vanguri Foundation of America, Inc.
 P.O. Box 1948, Stafford, TX 77497

మరిన్ని వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి

వంగూరి చిట్టెన్ రాజు  Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
మారుతి రెడ్డి (కన్వీనర్), President - హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి, maruthi@hotmail.com
Sai Rachakonda: Coordinator:, Phone:  281 235 6641, sairacha@gmail.com
కార్య నిర్వాహక సభ్యులు
C.N. Satyadev, Madhu Pemmaraju, Satybhama Pappu, Santha Susarla, Hema Nalini Tallavajjula, Sitaram Ayyagari, Pallavi Chillappagari, Uma Desabhotla, Sarada Akunuri, Ram Cheruvu, Venkatesh Nutalapati, Raj Pasala, Sudhesh Pilutla, Raghu Dhulipala, Krishna Keerty, Lalitha Rachakonda, Ravi Ponnapalli


No comments: