Thursday, July 4, 2013

P.R. COLLEGE, KAKINADA, MID DAY MEAL PROGRAM FOR UNDER PREVILEGED STUDENTS


P.R. Govt. COLLEGE, KAKINADA (Autonomous)
MID DAY MEAL PROGRAM FOR UNDER PREVILEGED STUDENTS
మిత్రులారా,
1884 లో సంస్థాపించబడి ప్రపంచ ప్రసిద్ది చెందిన పి. ఆర్. కాలేజీ (Pithapur Raja’s College) అంతకు ముందు 1952 నుంచీ ప్రభుత్వ యాజమాన్యంలో ఉండి, 2000-2001 నుండి ఆ కళాశాల స్వతంత్ర్య ప్రతిపత్తి హోదా కలిగి విద్యార్ధులకి ఉన్నత విద్యను అందించడంలో ఉత్తమ స్థాయి కృషి చేస్తోంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, ఎస్. వీ. రంగారావు, రేలంగి, మహర్షి బులుసు సాంబమూర్తి, దుర్గాబాయమ్మ గారు మొదలైన వేలాది లబ్ధప్రతిష్టులు ఈ కళాశాల పూర్వ విద్యార్ధులు. ఆ కాలేజీలో చదువుకున్న మేము గత మార్చ్ నెలలో ఆ కళాశాల ప్రాంగణాన్ని సందర్శించినప్పుడు ఆర్ధిక వనరుల కొరత కొట్టొచ్చినట్టు కనపడింది. ముందుగా ఆకట్టుకున్నది చిందర వందరగా పెరిగిపోయిన గడ్డి, అడ్డదిడ్డంగా ఎదిగిపోయిన చెట్లూ, భవనాల లోనూ ఎటు చూసినా maintenance చేపట్టలేని వాతావరణమే! తక్షణం మా మిత్రుడూ, కాకినాడ పుర ప్రముఖుడూ అయిన వై. యస్. ఎన్. మూర్తి, కాంట్రాక్టర్ స్నేహితుడు వినోద్ ల సహకారంతో లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టి, సుమారు పాతిక ఎకరాల కళాశాల ప్రాంగణాన్ని కొంత వరకూ బాగు చేయించాం.
వెనువెంటనే వై. ఎస్. ఎన్. మూర్తి సహకారంతో కాలేజ్ ప్రిన్సిపాల్ డా. ఎం. సత్యనారాయణ గారినీ, పూర్వ విద్యార్ధుల సంఘం  (P.R. College Old Students Association) సభ్యులనీ మేము కలుసుకుని అనేక అంశాలు, ముఖ్యంగా వారు తలపెట్టిన “విద్యార్ధుల మధ్యాహ్న భోజన పధకం” పుట్టు పూర్వోత్తరాలు, నిర్వహణలో ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నాం. ఆ కార్యక్రమం చాలా అత్యవసరమైనది గా మేము కూడా భావిస్తూ మానవతా దృక్పథంతో మనం అందరం చేతులు కలిపి, మన వంతు ఆర్ధిక సహాయం అందించడానికి మీ చిరు సహాయాన్ని అర్దిస్తున్నాం. దాతలకు అన్నదానమూ, విద్యాదానమూ కూడా చేసిన పుణ్యం దక్కుతుంది.
Mid Day Meal Program (MDDP) పూర్తి వివరాలు ఈ క్రింద ఇచ్చాం. మీ సత్వర స్పందనకు, దాతృత్వానికి ముందు గానే మా ధన్యవాదాలు. నేను, (వంగూరి చిట్టెన్ రాజు) జులై నెలాఖరులో కాకినాడ వెళ్లి, ప్రత్యక్షంగా ఈ మధ్యాహ్న పథకానికి కావలసిన ఏర్పాట్లు పర్యవేక్షించి మీరు అందించిన విరాళం సద్వినియోగం అయ్యే చర్యలు తీసుకుంటాను.   
Sincerely,
వంగూరి చిట్టెన్ రాజు, డా. మూర్తి ముత్యాల (Houston, TX.), &  Y.S. N. Murthy (Kakinada)
Contact Phones: 832 594 9054 (చిట్టెన్ రాజు) or 832 754 0924 (మూర్తి ముత్యాల)

Mid Day Meal for Under Previleged College Students.
P.R. College, Kakinada

Background:
A few years back our PR COLLEGE OLD STUDENTS ASSOCIATON (PRCOSA) noticed that some students who attend the college from neighboring rural areas could not afford to bring or buy full meals at lunch time. They suffer from fatigue and even faint on some occasions and hence try to skip afternoon classes.
Under the leadership of its officers, PRCOSA decided to commence a Mid Day Meal Program (MDMP) on humanitarian grounds, for those deserving students who need a lunch before the afternoon classes. With the cooperation and generous donations of the Alumni and local donors the program ran successfully for the last four years. Unfortunately, due to lack of consistent and reliable funding plans this program could not continue during the year 2012-13.
Our immediate objective is to raise funds for the MDMP for this academic year of 2013-2014 beginning this month (July, 2013). The total amount required is $100 (Rs.5000) from 125 generous persons on or before July 30, 2013. We identified this need based on available details summarized below.
·         Number of  Students in need of Mid Day Meals: 125
·         Number of Days Lunch is needed for the year:  180
·         Cost Per Lunch:  US$ 0.50 (Rs.30 approx.) per day

OUR REQUEST & APPEAL
We request you to please help by making a kind donation to meet the above need. Suggested Donation options are as follows.
·         Sponsor: Rs. 5000 or $100 or (Suggested minimum donation) which provides mid day meal for One Student for the entire academic year of 2013-2014. Donors can sponsor one or more students.  
·         All donor names of $100/Rs. 5000 or more will be displayed prominently in the Student’s Lunch Room, if received on or before July 30, 2013.
·         Any other amount.to show your support is appreciated.

HOW TO SEND DONATIONS IN INDIAN RUPEES
Donations in India can be sent as follows:  (IT exemption application is under progress)
·         Direct Deposit:  You can deposit your donation amount directly into the following account:
P.R.COLLEGE OLD STUDENTS ASSOCIATION
S.B A/c No.3166 835 7292
Branch: STATE BANK OF INDIA, Personal Banking division,
Main Road, KAKINADA 533001, A.P, INDIA.
IFS Code of the Bank: SBI N0004244

·         You can make your donation check payable to “P.R.COLLEGE OLD STUDENTS ASSOCIATION”  and mail to the following address.


P.R. College Old Students Association
C/O Y.S.N. Murty
7-4-20, Seshasai Street
Ramarao Peta
Kakinada- 533 004
Andhra Pradesh

HOW TO SEND YOUR TAX_DEDUCTIBLE DONATION IN USA: : ($100, -$1000)
All donations in USA are to be made through Vanguri Foundation of America, Inc. are tax-exempt in USA. Federal Tax ID # is 76-0444238. 100 % of donated amount will be used to provide midday meal to about 125 students
         ON-LINE: Please log-on to www.vangurifoundation.blogspot.com  , Click on DONATE button on right and follow prompts. Make sure to Enter PR College Mid Day Meal in the space for “Purpose”. 
         Mail your tax-deductible donation check to :
      Vanguri Foundation of America, Inc. P.O. Box 1948, Stafford, TX 77497
USE OF FUNDS:
         125 Students are selected from the Rolls of the college, of all branches who are deserving and in dire need of a midday meal. All qualified students were registered for the Midday Meal Program based on established need.
         Meals are provided by prior negotiation and Agreement with the Local Canteen/ Caterer, who supply food in the college premises, and in the dining hall specially built, for the purpose in the college campus. The College Principal & The Old Students Association Officials are experienced in the administration of this program.
         The following voluntary committee of will be responsible to organize, supervise and execute the Midday Meal Program during the academic year 2013-14.
          Y.S. N. Murthy (Kakinada),
E-mail: murtyyenamandra@yahoo.com
         Mrs. C. Usha Rani (Kakinada) , MR. V. Srinivasa Rao (Lecturer and Official of PR College),  Mr.N.V.V. Vinodh,  Mr. Ch.Suresh   
         Dr. Murty Mutyala (Houston, TX)
E-mail: mutyala41@yahoo.com
         Dr. Chitten Raju Vanguri
     Phones: 832 594 9054,  E-mail: vangurifoundation@gmail.com


For More Details and information please contact any of the above volunteers

Monday, July 1, 2013

18వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

18 ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
"శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది ( ఏప్రిలు 11, 2013) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 18 ఉగాది ఉత్తమ రచనల పోటీ లో క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ అధిక సంఖ్యలో అనేక దేశాలనుండి  చాలా మంది ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ పాల్గొనడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. వారి సాహిత్య కృషికి మా అభినందనలు. విజేతలుగా ఎంపిక అయిన రచనలతో బాటు, ఇతర మంచి రచనలను వీలును బట్టి ప్రచురించే ప్రయత్నం చేస్తాం. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే.

బహుమతి పొందిన రచనలూప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టికేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.

   “నా  మొట్టమొదటి కథ” - విభాగం విజేతలు
వాసన ”: శ్రీముహ, నార్వుడ్, మెసాచుసెట్స్, యు ఎస్   ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 “కార్పోరేట్ సుడిగుండాలు ”: వెంకట రమణ మూర్తి, కప్పగంతుల, సికింద్రాబాద్, ఆంధ్ర ప్రదేశ్, ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
దయామణి”: శ్రీనివాసరావు ఆదూరి, ఆంధ్ర ప్రదేశ్ (ప్రశంసాపత్రం)

నా  మొట్టమొదటి కవిత” - విభాగం విజేతలు
అర్థాలు చెరిపేసిన అనర్థం సంగతి”: సుజాత బుచ్చిబాబు, చోడవరం, ఆంధ్ర ప్రదేశ్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
చాయ్ : గోషికా ప్రణతి, నిజామాబాద్, ఆంధ్ర ప్రదేశ్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

ఉత్తమ కథానిక విభాగం విజేతలు
సవ్యాజ మానవులు" - ఎలెక్టాన్, హనుమ కొండ, ఆంధ్ర ప్రదేశ్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"ద్వంద్వం"-  శ్రీదేవి మురళీధర్, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ -($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"దిగుడు బావి" - సత్యదేవ్ చిలుకూరి, హ్యూస్టన్, టెక్సాస్, యు ఎస్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"తెగులు బ్లాగు"- ఆర్ శర్మ దంతుర్తి (ప్రశంసాపత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
"అష్టవిధ నాయికలు"- రాధిక నోరి, టాలహాస్సె, ఫ్లారిడా, యు ఎస్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
విజయోత్సాహం: జి.వి. యస్. నాగేశ్వర రావు, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"భవిత బాట"- ర్యాలి ప్రసాద్కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్ (ప్రశంసా పత్రం)
నిరంతరంగా మిగలాలి”: నరసింహ స్వామి, (ప్రశంసా పత్రం)


రచనల పోటీలో పాలొన్న వారందరికీ మరొక్క సారి  మా ధన్యవాదాలు. తెలుగులో వ్రాస్తూనే ఉండండి. మంచి అనుభూతిని పొందండి.