Thursday, September 9, 2010

రెండవ అంతర్జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం దిగ్విజయం

రెండవ అంతర్జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం ఆగస్టు 29-30-31 వ తారీకులలో దిగ్విజయంగా ముగిసింది. హైదరాబాదు లో శ్రీ త్యాగరాజ గానసభలో జరిగిన ఈ సమ్మేళనంలో ప్రధానాంశాలు ఈ క్రింద పొందుపరిచాం.

1. మొదటి రోజు (ఆగస్టు 29, 2010). ఉదయం 9 గంటలనుంచి రాత్రి పది గంటలదాకా జరిగింది ప్రారంభోత్సవ సభలో డా. వి.యస్. రమాదేవి, డా. ఆవుల మంజులత, డా. అరుణా వ్యాస్, సుమతీ కౌషల్ మొదలైన వారు ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలనుంచి ఎంపిక కాబడిన తెలుగు ఉపాధ్యాయినులను సముచితంగా సత్కరింఛారు. (శ్రీమతులు చుండి కృష్ణవేణి, జి. శ్యామల, ఆలమూరు శ్యామల, గరిమెళ్ళ సీతాదేవి, ఏలూరి ఝాన్సీ రాణి). తరువాత సాయంత్రం వరకూ 30 మంది మహిళల స్వీయ రచనా పఠనం, సాహిత్య ప్రసంగాలు, చర్చా వేదికలు జరిగాయి. అనంతరం, డా. లలితా కామేశ్వరి మరియు కె. రమాకుమారి నాట్యావధానం చెయ్యగా, ప్రత్యేక కార్యక్రమంగా "జయహో శ్రీ కృష్ణదేవరాయా" అనే కూచిపూడి నృత్యనాటకం జనరంజకంగా ప్రదర్శింఛబడింది. డా. సి. నారాయణ రెడ్డి నటీనటులనూ, నర్తకులనూ సముచిత రీతిగా సత్కరించారు.

2. రెండవ రోజు (ఆగస్టు, 30, 2010) సమ్మేళనం సాయంత్రం నాలుగు గంటలనుంచి పది గంటలదాకా సాగింది. శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి ప్రత్త్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సుమారు 25 మంది రచయిత్రుల సాహిత్య ప్రసంగాలు, చర్చావేదికల తరువాత రాయల నాటి కవయిత్రుల పాత్రలతో భామినీ భువన విజయం అనే రూపకం దిగ్విజయంగా ప్రదర్శించబడింది.
3. మూడవరోజు (ఆగస్టు 31, 2010) సమ్మేళనం శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారి ప్రసంగంతో ప్రారంభం అయి,  సాయంత్రం నాలుగు గంటలనుంచి పది గంటలదాకా జరిగింది. ముగింపుగా ఆంధ్ర ప్రభ-వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త నిర్వహణలో జరిగినిన "మొట్టమొదటి అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల కథల పోటీ"లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం అత్యంత వైభవంగా జరిగి ఈ మూడు రోజుల మహిళా రచయితల సాహిత్య సమ్మేళనానికి పరాకష్టగా నిలిచింది. ఈ ముగింపు సభలో డా. సి. నారాయణ రెడ్ది, డా. నన్నపనేని రాజకుమారి (శాసన సభామండలి సభ్యులు), గౌతమ్ ముత్తా (ఆంధ్ర ప్రభ అధినేత), పి .విజయబాబు ( ఆంధ్ర ప్రభ ప్రధాన సంపాదకులు) , బొప్పన పద్మ (కెనడా), ఇంద్రగంటి శ్రీకాంత శర్మ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ కథల పోటీలో విజేతలైలు అల్లూరి గౌరీలక్ష్మి (హైదరాబాదు), కల్లూరి శ్యామల (న్యూ ఢిల్లీ), కె.బి. లక్ష్మి (హైదరాబాదు), కె. వాసవ దత్త రమణ ( (హైదరాబాదు), కె. రాధా హిమబిందు (మణుగూరు), పి,వి, భగవతి (న్యూ జెర్సీ, అమెరికా), పి. శాంతాదేవి (న్యూ ఢిల్లీ), బి, గీతిక (జిన్నూరు, తూ.గో జిల్లా), రావులపల్లి రామలక్ష్మి (విశాఖపట్నం), శ్రీదేవీ మురళీధర్ ((హైదరాబాదు). ఈ పది మందికీ ఐదు వేల రూపాయల సమాన బహుమతి, ప్రశంశాపత్రమూ, జ్ఞాపిక బహూకరించబడ్డాయి.

సదస్సులో పాల్గొన్న శతాధిక రచయిత్రులలో స్థానిక వక్తలకి రూ.116 నగదు పారితోషికమూ, సుదూర ప్రాంతాలనుంచి వచ్చిన వారికి రూ.1,116 నగదు, అందరికీ తెలుగు పుస్తకాలూ, ప్రశంసాపత్రమూ, జ్ఞాపిక బహూకరించబడ్డాయి.

డా. తెన్నేటి సుధాదేవి, డా. జానకీ బాల ప్రధాన నిర్వాహకులుగా వ్యవహరించగా, డా. నాగరంజని, బాలాత్రిపుర సుందరి, శైలజా రాణి, శృతకీర్తి, సుధామయి, పద్మజా మల్లాది మొదలైన వారు పూర్తి సహకారాన్ని అందించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హైదరాబాదు) సంస్థ మేనేజింగ్ ట్రస్టీ వంశీ రామరాజు, చైర్మన్ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, వైస్ చైర్మన్ "రచన" సాయి , ధర్మారావు మొదలైన వారు ఈ సదస్సుకు వెన్నెముకగా నిలిచారు.

ఈ  అంతర్జాతీయ మహిళా సదస్సుకు రూపకల్పన చేసిన వారు వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్).
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహించిన ఈ రెండవ అంతర్జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం (ఆగస్టు 29-30-31), తదితర సాహితీ సదస్సుల చిత్ర మాలికలు, వార్తా విశేషాలూ (ఈ నాడు, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, ప్రజాశక్తి, సూర్య, సాక్షి) ఈ క్రింది లింక్ లో చూడండి.


Friday, August 6, 2010

అంతర్జాతీయ తెలుగు మహిళా రచయితల
 రెండవ సాహిత్య సమ్మేళనం
ఆగస్టు 29-30-31, 2010
ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల దాకా
శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడ్ పల్లి, హైదరాబాదు
ఈ సందర్భంలో "ఆంధ్ర ప్రభ" వారి సౌజన్య, సహకారాలతో, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు "మొట్ట మొదటి అంతర్జాతీయ మహిళా రచయితల కథల పోటీ" నిర్వహిస్తున్నారు. పది మంచి కథలకి ఒక్కొక్కటీ ఐదు వేల రూపాయల సమాన బహుమతులు ఇవ్వబడతాయి. ఈ పోటీకి మాకు కథలు చేరవలసిన ఆఖరి తేదీ ఆగస్టు 25, 2010. పూర్తి వివరాలకు vangurifoundation@yahoo.com ద్వారా మమ్మల్ని సంప్రదించండి.
తెలుగు భాషాభిమానులకు సాదర ఆహ్వానం
ఉచిత ప్రవేశం

గత ఏడాది (2009) మార్చ్ లో జరిగిన "మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహిళా రచయిత్రుల సాహిత్య సమ్మేళనం" లో ఒకే రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకూ తమదైన వేదికపై సుమారు 80 మంది మహిళా రచయితలూ, సాహితీవేత్తలూ పాల్గొని, అనేక సాహితీపరమైన అంశాలపై ప్రసంగించి, తెలుగు సాహితీ ప్రపంచంలో మహిళా రచయిత్రుల ప్రాభవాన్ని చాటి చెప్పి చరిత్ర సృష్టించారని పత్రికలలోనూ, టీవీ ప్రసారాలలోనూ వార్తలు వెలువడ్డాయి.
ఆనాటి స్పూర్తితో, ప్రపంచవ్యాప్తంగానూ, ముఖ్యంగా భారతదేశంలో నలుమూలలా ఉన్న తెలుగు మహిళా రచయితలకి తమదే అయిన మరొక సాహిత్య వేదిక ఏర్పాటుచేసే సదుద్దేశ్యంతో, ఈ నెల, అనగా, ఆగస్టు 29-30-31 వ తేదీలలో హైదరాబాదులోని శ్రీ త్యాగరాజ గానసభ ప్రధాన ప్రాంగణంలో "అంతర్జాతీయ తెలుగు మహిళా రచయితల రెండవ సాహిత్య సమ్మేళనం" జరగబోతోంది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్) వారు ప్రధాన నిర్వాహకులు.
సమ్మేళన ప్రధాన ఉద్దేశ్యాలు

1. తెలుగు రచయిత్రులు తెలిసిన స్నేహితులతోబాటు అనేక ప్రాంతాలనుంచి వచ్చే తోటి వారిని కలుసుకుని, సాహిత్యపరంగా ముచ్చటించుకోవడం. కొత్త పరిచయాలు పెంచుకోవడం.
2. తెలుగు రచయిత్రులు తమ సాహితీపాటవాన్ని ఇతరులతో పంచుకుని, ఇతరులనుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం.
3. అన్నింటికంటే ప్రధానంగా రచయిత్రులుగా, సాహితీవేత్తలగానే కాకుండా, మాతృమూర్తులుగా, సోదరీమణులుగా, ఇతరత్రా తెలుగువారందరి జీవితాలలో కేంద్రబిందువులైన మహిళలు, మనందరికీ కన్నతల్లి అయిన తెలుగు భాష, సాహిత్యాల అభివృధ్ధికి తాము చేయదగిన, చేయవలసిన కృషి, పై చర్చల ద్వారా ఈ మహిళా సదస్సు మంచి అవగాహన, దిశానిర్దేశం కలిగిస్తుందని మా నమ్మకం. మహిళా సాహితీవేత్తలు తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ అందరూ అనుమానిస్తున్న "మరణ శయ్య" నుంచి రక్షించగలరని మా నమ్మకం.
మహిళలు ప్రధాన నిర్వాహకులుగా ఉండే ఈ మహా సభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులూ, రచయితలూ, భాషాభిమానులూ మొదలైన వారందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
మహిళా వక్తలకు ఆహ్వానం, విన్నపం
సాహిత్యపరమైన విషయాలపై ప్రసంగించి, తమ అభిప్రాయాలను ఇతర రచయిత్రులూ, సాహిత్యాభిమానులతో పంచుకోవాలని అభిలషించే మహిళావక్తలందరికీ ఈ సమ్మేళనం ఒక వేదిక. ఈ సదస్సులో వక్తలుగా పాల్గొన దల్చుకున్న రచయిత్రులు, తాము ప్రసంగించదల్చుకున్న అంశాల వివరాలతో ఈ క్రింది వారిని సంప్రదించండి. ప్రత్యేక పరిస్ఠితులలో తప్ప ఏ ప్రసంగానికైనా కేటాయించిన సమయం పదిహేను నిముషాలు. ఈ సమ్మేళనంలో ప్రసంగించదల్చుకుంటే ఆసక్తి, సాహిత్యపరమైన ప్రసంగాంశం వివరాలు మాకు తెలియవలసిన ఆఖరి తేదీ ఆగస్టు 20, 2010. అన్ని విషయాలలోనూ తుది నిర్ణయం నిర్వాహకులదే.

డా. తెన్నేటి సుధా దేవి (Hyderabad)
Phone: 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in
శ్రీమతి ఇంద్రగంటి జానకీ బాల (Hyderabad)
Phone: (40) 27794073.

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు
అధ్యక్షులు
వంగూరి పౌండేషన్ ఆఫ్ అమెరికా
USA Phone: 832 594 9054
E-mail: vangurifoundation@yahoo.com

Monday, July 19, 2010

29 వ "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య కార్యక్రమం, హైదరాబాదు


ఉచిత ఆహ్వానం

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు శ్రీ త్యాగరాజ గాన సభ వారి సమిష్టి నిర్వహణలో జరిగే ఈ క్రింది
"నెల నెలా తెలుగు వెన్నెల" 29 వ కార్యక్రమానికి విచ్చేసి ఈ సాహిత్య సమావేశాన్ని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. ఈ సభకి తెలుగు సాహితీప్రియులందరూ అందరూ ఆహ్వానితులే.

సభా విశేషాలు

ప్రవేశం: ఉచితం

సభ జరిగే తేదీ: జూలై, 20 (మంగళ వారం)

సమయం: సాయంత్రం 6:30

స్థలం: "కళా సుబ్బారావు వేదిక": శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాదు.

కార్యక్రమం

"డా. సినారె కవిత్వంలో మానవతా మూల్యాలు" అనే అంశం పై ప్రసంగం

ప్రధాన వక్త: డా. ద్వానా శాస్త్రి (ప్రముఖ రచయిత, విమర్శకులు)

సభాధ్యక్షులు: శ్రీ పి. విజయ బాబు (సంపాదకులు, ఆంధ్ర ప్రభ దిన పత్రిక)

ప్రత్యేక ఉపన్యాసకులు: శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ

(ప్రసిధ్ధ రచయిత,పూర్వ సంపాదకులు, ఆంధ్ర ప్రభ వార పత్రిక)

వివరాలకు సంప్రదించవలసిన వారు: శ్రీ వంశీ రామరాజు, ఫోన్ 98490 23852

E-mail: ramarajuvamsee@yahoo.co.in

నిర్వాహకులు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్)

(వంగూరి చిట్టెన్ రాజు (సంస్థాపకులు), ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (ఛైర్మన్), వంశీ రామరాజు (మేనేజింగ్ ట్రస్టీ),

తెన్నేటి సుధా దేవి)(సమావేశ కర్త)

మరియు

కళా వెంకట దీక్షితులు

(అధ్యక్షులు) శ్రీ త్యాగరాజ గాన సభ

Friday, June 18, 2010


28 వ "నెల నెలా తెలుగు వెన్నెల", హైదరాబాద్

ఆహ్వానం


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు శ్రీ త్యాగరాజ గాన సభ వారి సమిష్టి నిర్వహణలో జరిగే ఈ క్రింది

"నెల నెలా తెలుగు వెన్నెల" 28 వ కార్యక్రమానికి విచ్చేసి ఈ సాహిత్య సమావేశాన్ని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. ఈ సభకి తెలుగు సాహితీప్రియులందరూ అందరూ ఆహ్వానితులే.
సభా విశేషాలు
ప్రవేశం: ఉచితం
సభ జరిగే తేదీ: జూన్, 19 (శనివారం)
సమయం: సాయంత్రం 6:30
స్థలం: "కళా సుబ్బారావు వేదిక": శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడపల్లి, హైదరాబాదు.
కార్యక్రమం: "శివ పురాణం" గ్రంధావిష్కరణ.
గ్రంధ కర్త: శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణ మూర్తి (ఉప సంపాదకులు, ఆంధ్ర ప్రభ దిన పత్రిక)
సభాధ్యక్షులు: శ్రీ పి. విజయ బాబు (సంపాదకులు, ఆంధ్ర ప్రభ దిన పత్రిక)
గ్రంధ ఆవిష్కర్త: "జ్ఞానపీఠ" అవార్డు గ్రహీత, పద్మభూషణ్, డా. సి. నారాయణ రెడ్డి.
విశిష్ట అతిథి: ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్
గ్రంధ పరిచయం: శ్రీ విహారి (సుప్రసిధ్ధ రచయిత, విమర్శకులు)
ప్రత్యేక అతిథి: శ్రీ మైథిలి వెంకటేశ్వర రావు (రచయిత, ప్రచురణ కర్త)
వివరాలకు సంప్రదించవలసిన వారు: శ్రీ వంశీ రామరాజు, ఫోన్ 98490 23852, E-mail: ramarajuvamsee@yahoo.co.in
నిర్వాహకులు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్)
(వంగూరి చిట్టెన్ రాజు (సంస్థాపకులు), ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (ఛైర్మన్), వంశీ రామరాజు (మేనేజింగ్ ట్రస్టీ), "రచన" సాయి (వైస్ ఛైర్మన్), తెన్నేటి సుధా దేవి)
(సమావేశ కర్త)
మరియు
శ్రీ త్యాగరాజ గాన సభ
కళా వెంకట దీక్షితులు (అధ్యక్షులు)
 
 
 
 

Thursday, April 29, 2010

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 15 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ: విజేతలు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య సేవా మరియు ధార్మిక సంస్థ)

Contact: vangurifoundation@yahoo.com

15 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

"వికృతి" నామ సంవత్సర ఉగాది (మార్చ్ 16, 2010)

విజేతల ప్రకటన

"వికృతి" నామ సంవత్సర ఉగాది (మార్చ్ 16, 2010) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 15 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ అధిక సంఖ్యలో అమెరికా, కెనడా, ఇంగ్లండ్, మధ్యప్రాచ్య దేశాలనుండి చాలా మంది రచయితలు పాల్గొనడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ముఖ్యంగా "నా మొట్టమొదటి కథ" ప్రక్రియలో అనేక మంది సరికొత్త కథకులు పాల్గొనడం విదేశాలలో తెలుగు సాహిత్య వికాసానికి శుభసూచకం. ఈ పోటీలో పాలుపంచుకుని, విజయవంతం చేసిన ఇంచుమించు అరవై ఐదు మంది రచయితలకు మా ధన్యవాదాలు. వారి సాహిత్య కృషికి మా అభినందనలు. విజేతలుగా ఎంపిక అయిన రచనలతో బాటు, ఇతర మంచి రచనలను వీలును బట్టి ప్రచురించే ప్రయత్నం చేస్తాం. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే.

నా మొట్టమొదటి కథ” - విభాగం విజేతలు

"అధమంలో ప్రధమం""విశ్వసాహితి", Chicago, IL ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

" యత్ర నార్యస్తు పూజ్యంతే "- సుధా నిట్టల, Roselle, IL ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"వేపచెట్టు" -శివ పార్వతి అనంతు (ప్రశంసాపత్రం)

"స్వర్గంలో ఓ సాయంత్రం" - కె. జయశంకర్ రెడ్డి, Salt Lake City, UT (ప్రశంసాపత్రం)

"భోగి పిడక" - వాసు ముళ్ళపూడి -Fremont, CA (ప్రశంసాపత్రం)

ఉత్తమ కథానిక విభాగం విజేతలు

"తారుమారు" - అక్కినపల్లి సుబ్బారావు, North Hills, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"మరో ప్రపంచం" - అనిల్ ఎస్. రాయల్, Sunnyvale, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"లోక రీతి" - అపర్ణ గునుపూడి మునుకుట్ల – Palo Alto, CA (ప్రశంసాపత్రం)

అబధ్దంలో అతడూ, ఆమె"- శ్రీనివాస ఫణి కుమార్ డొక్కా – Atlanta, GA (ప్రశంసాపత్రం)

ఉత్తమ కవిత విభాగం విజేతలు

వీడి పోయిన వస౦తాలు......ఉమ ఇయ్యుణ్ణి. St.Augustine, Fl ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"వృక్షాలుకమ్మని చెప్పండి" - కలశపూడి శ్రీనివాస రావు – Floral Park, NY ($116 నగదు పారితోషికం,

"సన్నాయి తాత - శ్రీనివాస ఫణి కుమార్ డొక్కా - Atlanta, GA (ప్రశంసాపత్రం)

"నేను" - నచకి - Ruston LA (ప్రశంసాపత్రం)

"సమిధ"- రాగసుధ వింజమూరి – London, UK (ప్రశంసాపత్రం)

"నిరీక్షణ" - ప్రసాదరాజు సామంతపూడి – Farmingtom Hills, MI (ప్రశంసాపత్రం)

ఉత్తమ వ్యాసం విభాగం విజేతలు

"భాష, అక్షరాస్యత" - కొడవటిగంటి రోహిణీప్రసాద్- New Orleans LA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"మహాకవి: శ్రీశ్రీ - సుబ్బారావు దూర్వాసులDartmouth, Canada ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"ఎక్కడినుంచి ఎక్కడి దాకా" - సత్యం మందపాటి – Phlugerville, TX. (ప్రశంసాపత్రం)