Saturday, April 20, 2019

24వ ఉగాది ఉత్తమ రచనల పోటీ -విజేతల ప్రకటన


24 ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 06, 2019) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 24 ఉగాది ఉత్తమ రచనల పోటీ లో క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ సారి పోటీకి అమెరికా నుంచే కాక, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా. సింగపూర్ దేశాల నుంచి రచయితలు స్పందించడమే కాక అధిక సంఖ్యలో బహుమతులు గెల్చుకోవడం చెప్పుకోదగ్గ విశేషం. ఈ సారి ఎంపిక చాలా కష్టతరమైనది అని మా న్యాయ నిర్ణేతలు భావించడం పోటీకి వచ్చిన కథల, కవితల స్థాయికి నిదర్శనం. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి’ లోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం24 సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
 గుండె గోస- మల్లికేశ్వర రావు కొంచాడ (Melbourne, Australia) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ఋణానుబంధం శ్రీమతి శేషు శర్మ (Atlanta, GA)  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ఆత్మారామం” – రాధిక నోరి  (Talahasse, FL) ప్రశంసా పత్రం
తిరంగా ప్యార్”- రేష్మా మహమ్మద్ (Fremont, CA) ప్రశంసా పత్రం

ఉత్తమ కవిత విభాగం విజేతలు
 చినుకు- రాపోలు సీతారామ రాజు (Johannesburg, South Africa)($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 మలుపు– ఇంద్రాణి పాలపర్తి (Houston, TX) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“అర్ధం కాదు” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia) (ప్రశంసా పత్రం)
=======================================================================
మొట్టమొదటి రచనా విభాగం” -11 సారి పోటీ
 "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు
క్షణం -క్షణికం ఫణి రాజేష్  ( Yokohama, Japan) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“కాలం కలం పట్టిన వేళ”- సావిత్రి తాడికొండ (Fair Lawn), NJ) ప్రశంసా పత్రం

 “నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు
నిజాలెవరికి కావాలి రాధిక మంగిపూడి (Singapore) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ఎవరు హీరో?” – మందడి శ్రీకాంత్ (Johannesburg, South Africa) ప్రశంసా పత్రం  

================================================================
న్యాయ నిర్ణేతలకి అభివాదాలతో, పోటీలో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలతో, విజేతలకు అభినందనలతో
భవదీయులు
వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)
E-mail: vangurifoundation@gmail.com