Friday, April 11, 2014

ఆహ్వానం - ప్రకటన - విజ్ఞప్తి
అమెరికా తెలుగు కథానిక - 12వ సంకలనం
(మా 55వ ప్రచురణ -2014)
1995 నుంచీ  వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురిస్తున్న,  ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెరికా తెలుగు కథానిక పరంపరలో 12 వ సంకలనం 2014 వ సంవత్సరంలో వెలువడుతుంది. ఈ పుస్తకంలో ప్రచురణార్ధం మీరు రచించి, గత రెండు, మూడు సంవత్సరాలలో ముద్రించబడిన ఒకటి, రెండు మంచి కథలను మా పరిశీలనకు పంపించమని తాత్కాలిక లేదా శాశ్వత ప్రాతిపదికపై ఉత్తర అమెరికాలో నివసిస్తున్న కథకులను కోరుతున్నాం. అలాగే, సాహితీవేత్తలనూ, పాఠకమహాశయులనూ తమకు నచ్చిన, ఈ కోవకు చెందిన..ఆనగా ఉత్తర అమెరికా నివాసులైన తెలుగు రచయితల మంచి కథలను మాకు పంపించి, లేదా సూచించి సహకరించమని కోరుతున్నాం. కథల కాపీ, మరియు ప్రచురణ వివరాలు కూడా మాకు తెలియపరచండి. ఉత్తర అమెరికా లో మన జీవితాలకి సంబందించిన ఇతివృత్తాలకి (డైస్పోరా కథలు) ప్రాధాన్యత ఇస్తాం. కథల సేకరణ మరియు ఎంపిక విషయాలలో తమ సహకారాన్ని అందించమని పత్రికలూ, వెబ్ మేగజీన్ సంపాదకులూ, బ్లాగులూ, వెబ్ ప్రచురణలూ ఉన్న కథకులనూ, ప్రత్యేకంగా అర్ధిస్తున్నాం. కథలు సూచించిన వారి పేరు, తొలి ప్రచురణ వివరాలు ఈ సంకలనంలో ప్రచురించి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం.  అన్ని విషయాలలోనూ తుది నిర్ణయాలు మావే!    
మీ కథలూ, కథా సూచనలూ మాకు చేరవలసిన ఆఖరి తేదీ: ఏప్రిల్ 20, 2014

Address to send entries or Suggestions
Soft copies by e-mail only (PDF, JPEG or in Unicode Fonts which is preferred.)
Fax: 1-866 222 5301
For any additional details, please contact any of the following:

Chitten Raju Vanguri                                                                                          Sai Rachakonda
Phone: 832 594 9054                                                                              Phone: 281 235 6641    
E-mail: vangurifoundation@gmail.com                                      E-mail: sairacha2012@gmail.com
                 


Tuesday, April 8, 2014


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
19 ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
"శ్రీ జయ నామ సంవత్సర ఉగాది (మార్చ్ 31, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 19 ఉగాది ఉత్తమ రచనల పోటీ లో క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ అధిక సంఖ్యలో అనేక దేశాలనుండి  చాలా మంది ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ పాల్గొనడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.
ప్రధాన విభాగం19 సారి పోటీ
ఉత్తమ కథానిక విభాగం విజేతలు
ఎత్తరుగుల ఇల్లు –మధు పెమ్మరాజు, Katy, TX.  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
భార్య విద్యలో బి.ఏ – కలశపూడి శ్రీనివాస రావు, New York, NY  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
జీవన చిత్రం –గంధం యాజ్ఞ్యవల్క్య శర్మ, నరసరావు పేట  (ప్రశంసా పత్రం)
ఏం మాయ చేసావో !!. - కోసూరి ఉమాభారతి, Houston, TX  (ప్రశంసా పత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
జన్మ – యోగానంద్ సరిపల్లి (San Jose)  ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
కృతజ్ఞతలు -నారాయణ గరిమెళ్ళ, Herndon, VA  ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
రహదారిలో గడ్డిపోచలు  -  డా.మాదిన రామకృష్ణ ( చెస్టర్ ఫీల్డ్,ఇంగ్లండ్.)  (ప్రశంసా పత్రం)
స్వేదం – భరత్ భూషణ్ రెడ్డి (హైదరాబాద్) (ప్రశంసా పత్రం)
=======================================================================
మొట్టమొదటి రచనా విభాగం” -5 సారి పోటీ
 "నా మొట్ట మొదటి కథ” విభాగం విజేతలు
“సారీ సెంటర్” –టి. నవీన్ (హైదరాబాద్) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ఆఖరి వీలునామా –భండారు విజయ (హైదరాబాద్) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“సహజ” – బి. మెర్సీ మార్గరెట్  (హైదరాబాద్) (ప్రశంసా పత్రం)
“అదే నవ్వు”- కుడికాల “సరోజనార్ధన్” వంశీధర్, హనుమకొండ (ప్రశంసా పత్రం)
“నా మొట్టమొదటి కవిత” విభాగం విజేతలు
“తాళం” – కామేష్ పూళ్ళ (యానాం): ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
నేనొక విహంగమై చెన్నూరు నరేంద్ర నాథ్,  కలకత్తా ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
“రొమాన్స్ చచ్చిపోయింది”- శివ్వాల గోవింద రావు  (ప్రసంసాపత్రం)
“మొదటి కవిత” – కర్రి రఘునాథ శంకర్ , యలమంచిలి  (ప్రసంసాపత్రం)
=================================================================
యువతరం విభాగం-  తొలి సారిగా ప్రవేశ పెట్టబడిన పోటీ
ఉత్తమ కవిత విభాగం విజేతలు
నా యుగం : మల్లిపూడి రవిచంద్ర, Hyderabad  ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
అడవిలా-ప్రసూన రవీంద్రన్, శేరిలింగంపల్లి ($58 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
నిర్భయ గొర్లె హరీష్ , కాకినాడ  (ప్రశంసా పత్రం)
ప్రవహిస్తూనే ఉంటా – దోర్నాదుల సిద్ధార్థ, పలమనేరు  (ప్రశంసా పత్రం)
ఉత్తమ కథానిక  విభాగం విజేతలు
అర్ధ శతాబ్దపు అజ్జానం మోహిత కౌండిన్య , హైదరాబాద్  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
పున్నాగ పూల జల్లు మధురవాణి, Freising, Germany, ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
ఆమె జీవితాన్ని జయించింది S. V. కృష్ణ జయంతి, హైదరాబాద్  (ప్రసంసాపత్రం)
అపరిచితుడు నగేష్ బీరేడ్డి , రామగిరి, నల్గొండ (ప్రసంసాపత్రం)
అనేక దేశాల నుండి ఈ రచనల పోటీలో పాలొన్న యువతీ యువకులకీ, పెద్దలకీ మరొక్క సారి  మా ధన్యవాదాలు.

భవదీయులు

వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)