Thursday, August 14, 2014




వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా  
యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం (యుక్త) నిర్వహణలో
నాలుగవ  ప్రపంచ  తెలుగు సాహితీ సదస్సు
September 27-28, 2014 (Saturday & Sunday) 9 AM-5 PM
London, UK
Conveners: Vanguri Chitten Raju (USA) & Jayakumar Guntupalli (UK)
--------------------------------------------------------------------------------------------------------------------------------------------
సాదర ఆహ్వానం
ప్రపంచ వ్యాప్తంగా గత ఇరవై సంవత్సరాలగా శతాధిక సాహితీ సదస్సులూ, సాహిత్య కార్యక్రమాల నిర్వహణలో  అనితర సాధ్యమైన అనుభవం గల "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా" వారు సంచాలకులుగా,  యునైటెడ్ కింగ్డం లో తెలుగు వారి సంక్షేమం, సాంస్కృతిక పరిరక్షణ కోసం నెలకొల్పబడి, అచిరకాలంలోనే ఎన్నెన్నో కార్యక్రమాలను రూపొందించిన  యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం (యుక్త) వారి సమర్థవంతమైన  కార్యాచరణలో, వచ్చే నెల సెప్టెంబర్ 27-28, 2014 లలో రెండు రోజుల పాటు "నాలుగవ  ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" లండన్ మహానగరంలో జరగబోతోంది. ఐరోపా ఖండంలో , అందునా లండన్ మహా నగరంలో  మొట్టమొదటి సారిగా అత్యున్నత స్థాయిలో జరగబోయే ఈ నాలుగవ  ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పాల్గొని, తమ రచనలనూ, సాహిత్యపరమైన అభిప్రాయాలనూ, విశ్లేషణలనూ, పాండిత్య ప్రకర్షనూ సహసాహితీవేత్తలతో పంచుకోమని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తెలుగు భాషాభిమానులందరూ మహాసభలకి ఆహ్వానితులే.
భారత దేశ అతిధులు
ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఉపాధ్యక్షులు గౌ. మండలి బుద్ధ ప్రసాద్,  కేంద్ర సాహిత్య ఎకాడెమీ బహుమతి గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సుప్రసిద్ధ కవులు “సిరివెన్నెల”, సుద్దాల అశోక్ తేజ, తనికెళ్ళ భరణి, కొలకలూరి ఇనాక్, ద్వానా శాస్త్రి, తెన్నేటి సుధాదేవి మొదలైన వారు, కేంద్ర సాహిత్య ఎకాడమీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. శ్రీనివాస రావు తదితరులు  ఈ అంతర్జాతీయ సాహిత్య సదస్సుకి ప్రత్యేక అతిథులుగా విచ్చేయబోతున్నారు. అమెరికా, ఐరోపా ఖండాల నుండి తగిన సంఖ్యలో సాహితీవేత్తలు, రచయితలూ, కవులు ఈ సమావేశాలలో పాల్గొంటారు.
    ప్రత్యేక ఆకర్షణలు
స్వీయ రచనా పఠనం, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, చర్చా వేదికలు, సరదా సాహిత్య పోటీలు,  “సాహిత్య "ప్ర-జ" ప్రత్యేక వేదిక” (సాహిత్యపరమైన ప్రశ్నలూ-జవాబులు), అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, మరెన్నో....   
రచయితలకు, వక్తలకు విన్నపం
ఐరోపా ఖండంలో కేవలం తెలుగు సాహిత్యానికి మాత్రమే పెద్ద ఫీట వేస్తూ నిర్వహించబడుతున్న మొట్టమొదటి ప్రయత్నంగా మహా సభలు గా చారిత్రాత్మక గుర్తింపు పొందుతాయి అని విజ్ఞుల అభిప్రాయం.

ప్రతిష్టాత్మకమైన మహాసభలలో ప్రసంగించదల్చుకున్న వక్తలు, పాల్గొనదల్చుకున్న వారు, తమ స్వీయ రచనలను వినిపించదల్చుకున్న రచయితలుమరిన్ని వివరాలు తెలుసుకోదల్చుకున్న వారు క్రింది వారిని సంప్రదించండి. ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాషాసాహిత్యాలకి సంబంధించినవే ఉండాలి. తెలుగు భాషా, సాహిత్యాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగించే ప్రయత్నాలను చర్చించడం ఈ సదస్సులో ఒక ప్రధానాంశం.
Dr. Ramakrishna Madina (UK), E-mail: madina@yahoo.co.uk, Phone: (44) 124 656 9500 (UK)
Vanguri Chitten Raju (Houston, TX. USA)    E-mail:  vangurifoundation@gmail.com, Phone: 832-594-9054

విదేశాలనుంచి వచ్చే ప్రతినిథులు లండన్ లో తమ ఏర్పాట్ల విషయమై ఈ క్రింది వారిని సంప్రదించండి.
Satyaprasad Killi
Phone: 44-7466 398623 (UK), 91-96763 60256 (India), E-mail: killy@hotmail.com