Monday, April 12, 2021

 

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

(1994 లో సంస్థాపించబడిన లాభాపేక్షలేని తెలుగు సాహిత్య సేవా మరియు ధార్మిక సంస్థ)

www.vangurifoundation.blogspot.com

Contact: vangurifoundation@gmail.com: Phone:1 832 594 9054

---------------------------------------------------------------------------------------------------

26 ఉగాది ఉత్తమ రచనల పోటీ

విజేతల ప్రకటన

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

"శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 12, 2021) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 26 ఉగాది ఉత్తమ రచనల పోటీ లో క్రింది రచనలు ఉత్తమ రచనలు గా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా. చెక్ రిపబ్లిక్, సింగపూర్, ఐర్లండ్ దేశాల నుంచి రచయితలు స్పందించడం చెప్పుకోదగ్గ విశేషం. “నా మొట్టమొదటి కథ, కవిత”  విభాగాలకి ఈ సారి కలం పట్టిన ఔత్సాహిక విదేశీ రచయితలు అధిక సంఖ్య లో ఉన్నారు. అందు వలన ముందు ప్రకటించిన ఒక నగదు బహుమతికి అదనంగా మరొక సమాన బహుమతిని అందిస్తున్నాం. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి.కామ్’ లోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి కృషికి గుర్తింపుగా తెలుగు సాహిత్యాభిమాని శ్రీ ముదుగంటి జితేందర్ రెడ్డి (హ్యూస్టన్) గారు బహుమతులకి స్వఛ్ఛందంగా నగదు ప్రదానం చేయడం ఈ సారి ప్రత్యేకత.  ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.  విజేతల వివరాలు:

ప్రధాన విభాగం26 సారి పోటీ

ఉత్తమ కథానిక విభాగం విజేతలు

 కర్మ యోగి- శ్రీధర్ రెడ్డి బిల్లా (Cupertino, CA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

మిలియన్ డాలర్ బేరం” శర్మ దంతుర్తి (Elizabethtown, KY)  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

శ్రీలక్ష్మి” – శ్యామలాదేవి దశిక  (Monmouth Junction, New Jersey) ప్రశంసా పత్రం

మరోమారు- రాధిక నోరి, Tallahassee, FL) ప్రశంసా పత్రం

ఉత్తమ కవిత విభాగం విజేతలు

“ఇవాళ మాత్రం” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

తొలిపొద్దు సూర్యుళ్ళు- సుధా శేఖర్ (Milwaukee, WI) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

  ఇక్కడంతా క్షామమే-రాపోలు సీతారామ రాజు (Johannesburg, South Africa) ప్రశంసా పత్రం

 వీడ్కోలు - శాంత రాయప్రోలు (Jacksonville, FL) (ప్రశంసా పత్రం)

=======================================================================

మొట్టమొదటి రచనా విభాగం” -13 సారి పోటీ

“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు

ఇంత సౌఖ్యమని నే చెప్పజాల రవి మంత్రిప్రగడ (Dublin, Ireland) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

హృదయ స్పందన- కల్యాణి నల్లాన్ చక్రవర్తుల (Sunnyvale, CA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 

“మత్స్య గంధి”- రామ్ నాథ్ బొద్దపాటి (Danbury CT) ప్రశంసా పత్రం

పరిచితులు”- శ్రీనాథ్ వాడపల్లి (New Jersey, USA) ప్రశంసా పత్రం

 "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు

అన్ టైటిల్డ్”- శ్రీనాథ్ వాడపల్లి (New Jersey, USA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

జ్ఞాపకాల బరువు”- రవి మంత్రిప్రగడ (Dublin, Ireland) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

వర్షంలో ఓ సాయంత్రం”- లత కందికొండ (ISSAQUAH, WA) ప్రశంసా పత్రం

“ఉగాదులు ఉషస్సులు”- దామరాజు విశాలాక్షి(Canada) ప్రశంసా పత్రం

================================================================

న్యాయ నిర్ణేతలకి అభివాదాలతో, పోటీలో పాల్గొన్న రచయితలకి ధన్యవాదాలతో, విజేతలకు అభినందనలతో,

ఆర్ధిక మద్దతుదారులకి కృతజ్ఞతలతో, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో  

భవదీయులు

వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)

Vanguri Foundation of America, Inc.

3906 Sweet Hollow Court, Sugar Land, TX. 77498

E-mail: vangurifoundation@gmail.com

 

Tuesday, August 27, 2019



వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
E-mail: vangurifoundation@gmail.com, Phone: 832 594 9054
అమెరికా తెలుగు రచయితలకు మాత్రమే
ఆహ్వానం - ప్రకటన - విజ్ఞప్తి
అమెరికా తెలుగు కథానిక - 14వ సంకలనం
(మా తదుపరి ప్రచురణ -2019)
(కథలు మాకు అందవలసిన ఆఖరి తేదీ సెప్టెంబర్ 10, 2019)
1995 నుంచీ మేము ప్రచురిస్తున్న, తెలుగు సాహిత్య రంగంలో ప్రాచుర్యం పొందుతున్న అమెరికా తెలుగు కథానిక పరంపరలో 14వ సంకలనం  2019వ సంవత్సరంలో వెలువడుతుంది. ఈ గ్రంధం త్వరలోనే జరగనున్న 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో ఆవిష్కరించబడుతుంది. ఆ సదస్సు ఎప్పుడూ, ఎక్కడా మొదలైన వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. 37 మంది అమెరికా రచయితల కథలతో గత 2017 లో ప్రచురించబడిన అమెరికా తెలుగు కథానిక – 13 సంకలనం అశేష పాఠకాదరణ పొందిందిన సంగతి తెలిసినదే!

రాబోయే 14వ సంకలనంలో ప్రచురణార్ధం మీరు స్వయంగా రచించిగత రెండుమూడు సంవత్సరాలలో ఏదో ఒక మాధ్యమం (వ్రాత పత్రిక, అంతర్జాల పత్రిక, బ్లాగ్ వగైరా) లో ప్రచురించబడిన ఒకటిరెండు మంచి కథలను మా పరిశీలనకు పంపించమని ఉత్తర అమెరికా కథకులను కోరుతున్నాం. అలాగే, సాహితీవేత్తలనూ, పాఠక మహాశయులనూ తాము చదివిన అమెరికా రచయితల కథలలో మంచివి మాకు పంపించి, లేదా సూచించి సహకరించమని కోరుతున్నాం. కథల కాపీమరియు తొలి ప్రచురణ వివరాలు కూడా మాకు తెలియపరచండి. కథల సేకరణ మరియు ఎంపిక విషయాలలో తమ సహకారాన్ని అందించమని పత్రికలూఅంతర్జాల పత్రికల సంపాదకులూ, వ్యక్తిగత & ఇతర బ్లాగులూవెబ్ ప్రచురణలూ ఉన్న కథకులనూప్రత్యేకంగా అర్ధిస్తున్నాం.
మీ కథలూకథా సూచనలూ మాకు చేరవలసిన ఆఖరి తేదీ: సెప్టెంబర్ 102019.
'ప్రచురణార్హమైన కథల ఎంపికలో సంపాదకులదే తుది నిర్ణయం'
Please send Soft copies only by e-mail to the following:
(Unicode Word Preferred. PDF or JPEG attachments are also accepted)

For any additional details, please contact any of the following:
Chitten Raju Vanguri (Phone: 832 594 9054) vangurifoundation@gmail.com
Sai Rachakonda: sairacha@gmail.com
Vanguri Foundation of America
3906 Sweet Hollow Court, Sugar Land, TX 77498
Federal Tax ID; 76-0444238