Wednesday, January 14, 2015

Help Rebuild Andhra University, Visakhapatnam Campus from HuHud Super Cyclone Devastation




అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Help Rebuild Andhra University from HuHud Super Cyclone Devastation

నేపధ్యం:

1926 వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో డా. కట్టమంచి రామలింగా రెడ్డి  తొలి ఉప కులపతిగా నిర్వహణలో విశాఖ పట్నంలో ప్రారంభంచిబడిన ఆంధ్ర విశ్వ కళా పరిషత్, ప్రపంచ ప్రసిద్ద మేధావి, తత్వవేత్త, భారత దేశ అధ్యక్షుల పదవి అలంకరించిన డా, సర్వేపల్లి రాధాకృష్ణయ్య పండితులు మొదలైన లబ్ధప్రతిష్టుల దిశా నిర్దేశంలో గత తొమ్మిది దశాబ్దాలగా అన్ని రంగాలోనూ  ఉన్నత శిఖరాలను అధిగమిస్తూ ప్రస్తుత ఉప కులపతి డా. జి. ఎస్.ఎన్. రాజు గారి సమర్థవంతమైన నాయకత్వంలో భారత దేశం మొత్తంలోనే అత్య్తుత్తమమైన పది విశ్వవిద్యాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. నోబెల్ బహుమతి పొందిన సి.వి. రామన్, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సి.ఆర్. రావు, హుమాయున్ కబీర్, సూరి భగవంతం, టి.ఆర్. శేషాద్రి, వి.కే.ఆర్.వి.రావు మొదలైన శాస్త్రవేత్తలు చదువుకుని, ఉపాధ్యాయులుగా పని చేసి వేలాది ఉత్తమ స్థాయి విద్యార్థులను తీర్చి దిద్దినది అత్యంత సుందరమైన విశాఖ పట్నం ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం లోనే.
ఆంధ్రా యునివర్సిటీ విశాల ప్రాంగణంలో లో “సద్ధర్మ సదన”,  “శాత వాహన” లాంటి హాస్టల్ భవనాలు, అసెంబ్లీ హాల్, కాన్వోకేషన్ హాల్, టిఎల్.ఎన్, సభ హాల్, ఇంజనీరింగ్ కాలేజ్ భవనాలూ మొదలైనవి వేటికవే కళకళ లాడుతూ పచ్చటి చెట్ల మధ్య సగర్వంగా తమ ఉనికి చాటుకుంటూ విద్యార్థినీ, విద్యార్థులకీ, అధ్యాపకులకీ, స్టాఫ్ కీ ఎంతో గర్వంగా ఉండేవి...

కానీ దురదృష్టవశాత్తూ, 

గత అక్టోబర్ 12, 2014 నాడు హుడ్ హుడ్ అనే మహమ్మారి తుఫాను విశాఖపట్నం తీరాన్ని అత్యంత భీభత్సంగా తాకి, కనీ. వినీ ఎరుగని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగించింది. ఆ తుఫాను ప్రభావం వలన మన ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆ తీవ్రతని మీకు తెలియపరచడానికి ఇందుతో కొన్ని ఫోటోలు జత పరిచాం.

ఇప్పటి వరకూ మా స్పందన:

తుఫాను తాకిడి రోజుల నుంచీ అక్కడ చదువుకున్న మా స్వచ్చంద పూర్వ విద్యార్థుల బృందం వైస్ చాన్సలర్ జి.ఎస్.ఎన్. రాజు గారితో వ్యక్తిగతంగా పదే, పదే మాట్లాడుతూ, జరిగిన నష్టం తీవ్రత గురించి ఒక స్పష్టమైన అవగాహనకి వచ్చి,  తగిన ఆర్ధిక సహాయం అందించడానికి పూనుకున్నాం. అది మా గురుతర బాధ్యతగా భావించి ముందు విడతగా సుమారు $5000 త్వరితగతిని సేకరించి వైస్ చాన్సలర్ గారికి అప్పుడే అందించడం జరిగింది. పడిపోయిన చెట్లనీ, టెలిఫోన్ స్తంభాలూ, ఇతర అడ్డంకులూ అర్జంటుగా తొలగించి రోడ్లన్నింటినీ మళ్ళీ కొంతైనా మామూలు పరిస్థితి నెలకొల్పడానికి ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి.

గత 90 సంవత్సరాల చరిత్రలో విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఇటువంటి ప్రకృతి వైపరీత్యానికి గురికావడం ఇదే మొదటి సారి. ఈ పరిస్థితిని ఎదుర్కొనడంలో మన యూనివర్సిటీకి యధాశక్తి తోడ్పడవలసిన బాధ్యత మనందరి మీదా ఉంది అని మా దృఢమైన నమ్మకంతో మీరు కూడా అంగీకరిస్తారని ఆశిస్తూ, మీ తక్షణ స్పందనకి ఎదురు చూస్తున్నాం. 
   
తక్షణ అవసరాలు:  $25,000 – మార్చ్ 1 లోపుగా

Based on detailed & personal input received from Hon.ble Vice Chancellor Prof. G.S.N. Raju garu, we are requesting your tax-dedcutible support for the following essential and urgent requirements.

1.           To repair the damaged quarters of non-teaching staff.
2.    To repair Andhra University south campus hospital & students health clinic.

3.     To repair department labs, academic, administrative buildings, convocation theatre, Dr. B.R. Ambedkar Assembly Hall, Engineering college library etc.

మీకు మా అత్యవసర విన్నపం:

మీరు కానీ, మీ బంధుమిత్రులలో ఎవరైనా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో చదువుకున్నా, మీకు ఆ విశ్వవిద్యాలయంతో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధం ఉన్నా, విశాఖపట్నం తోఆత్మీయ అనుబంధం ఉన్నా, కేవలం మానవీయతా దృక్పధంతోనైనా సరే సహాయం చెయ్య దల్చుకున్న తెలుగు వారందరినీ ప్రకృతి వైపరీత్యానికి గురి అయిన మన చారిత్రక విశ్వవిద్యాలయాన్ని పునరుద్దరించడానికి పన్ను రాయితీ గల విరాళం అందించి తగిన సహాయం చెయ్యమని అర్దిస్తున్నాం.

 With the kind support of Andhra University Alumni, Well wishers of Visakhapatnam and all the generous Telugu people with a kind heart, we are confident that the proposed $25000 will be raised on or about March 1, 2015.

Suggested Donation Categories

(All donations are tax-deductible in USA and will be sent directly to the Andhra University Cyclone Relief Fund set up by Hon.ble Vice Chancellor G.S.N. Raju garu. All donors will be gratefully acknowledged and their names will be prominently recognized on-site as appropriate)   

o   AU Grand Patron: $5000 (Rs. 3 Lacs)
 AU Special Patron: $2500 (Rs. 1.5 Lacs)
AU General Patron: $1000 (Rs. 50001- Rs. 1 Lac)
AU Patron: $500 (Rs. 25001-Rs. 50000)
o   AU Supporter: $250 (Rs.15001 - Rs. 25000)
·        General Supporter: $100 (Rs. 5000-15000)

All other donations are gratefully accepted.

How to Donate
On-line from USA or any other country
Please click on the following link or copy & paste in your URL and follow the prompts.


or

Please make your tax-deductible check to Vanguri Foundation, write “AU Cyclone Relief” in the Memo section and mail to:

Vanguri Foundation of America, Inc
P.O. Box 1948
Stafford, TX 77497

DONORS FROM INDIA
Andhra University Supporters in India are requested to send in their tax-deductible donations by cash or transfer from SBI or any Bank directly as follows:
AU Cyclone Releif Fund Account
State Bank of India
Account Number: 34314585210
Branch Code; 00772
IFC Code: SBIN0000772
Phone: 89850 14999

For More Details, please call any of the following volunteers.
Ravindranath Duggirala: duggirala@uthscsa.edu
Hemanth Nimma: hemanth228@gmail.com
Roman R. Ganta: rganta@vet.k-state.edu
Phani Kondapi: phanikondapi@yahoo.com
Murty V. Vundavalli:  vvm2@cumc.columbia.edu
Vanguri Chitten Raju: vangurifoundation@gmail.com






Thursday, January 8, 2015

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ రచయితలకు ఆహ్వానం

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం
                           (రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 12015)                          

గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూరాబోయే "మన్మధ నామ సంవత్సర ఉగాది (మార్చ్ 212014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.
ప్రధాన విభాగం – 20వ సారి పోటీ నిర్వహణ
ఏ వయస్సు వారైనాఏ దేశంలో ఉన్నాతెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $58

మొట్ట మొదటి రచనా విభాగం” -6 వ సారి పోటీ నిర్వహణ
కథకవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నాచిన్న ప్రయత్నాలు చేసినాఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆరవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండాప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
"నా మొట్ట మొదటి కథ": (ఉత్తమ కథ):  $116
"నా మొట్టమొదటి కవిత": (ఉత్తమ కవిత): $58
యువతరం విభాగం- 2 వ సారి నిర్వహణ
ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రంకళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.
ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $116
                ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $58

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
·    ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
·    తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
·         రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
·    బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
·         విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు కాని, అంతకు ముందు కానీ  (మార్చ్ 21, 2015) ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
·    విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is:  March  1, 2015
Please send entries by e-mail attachments (PDF, JPEG or Unicode fonts)

భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్ & హైదరాబాద్
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com