Tuesday, March 29, 2011

16 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

"శ్రీ ఖర" నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 4, 2011) శుభాకాంక్షలతో 
 
"శ్రీ ఖర" నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 4, 2011) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 16వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీలో పాలుపంచుకుని, విజయవంతం చేసిన ఇంచుమించు ఎనభై మంది రచయితలకు మా ధన్యవాదాలు.

ఈ పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ అమెరికా, కెనడా, కెన్యా, ఇథియోపియా, ఐరోపా దేశాలనుండి చాలా మంది రచయితలు పాల్గొనడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ సంవత్స్రరం లో ప్రవేశ పెట్టిన "నా మొట్టమొదటి కవిత" ప్రక్రియకీ, రెండవ సారి నిర్వహించిన "నా మొట్టమొదటి కథ" ప్రక్రియకీ చాలా మంది సరికొత్త కవులూ, కథకులూ పాల్గొనడం విదేశాలలో తెలుగు సాహిత్య వికాసానికి శుభసూచకం. విజేతలుగా ఎంపిక అయిన రచనలతో బాటు, ఇతర మంచి రచనలు "కౌముది.నెట్" అంతర్జాల పత్రిక, మరియు "రచన" మాస పత్రిక (హైదరాబాదు) లోనూ ప్రకటించబడతాయి. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే.

బహుమతి ప్రదానం జూలై 16-17, 2011 వ తారీకులలో హ్యూస్టన్, టెక్సస్ లో జరగబోయే ప్రతిష్టాత్మక "మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" లో ప్రత్యేక ఆహ్వానితులైన ప్రముఖ సాహితీవేత్తల చేతుల మీదుగా, సభాముఖంగా జరుగుతుంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం.

“నా మొట్టమొదటి కథ” - విభాగం విజేతలు

"తల్లి కాకి-పిల్ల కాకి" – "చిలుకూరి సత్యదేవ్", Houston, TX. ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"సంస్కారం"- కాంతి పాతూరి, Dublin, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"నారదభక్తి సూత్రాలు"- శ్రీమతి మణి న్యాయపతి, Atlanta, GA (ప్రశంసాపత్రం)

"రాధా-కృష్ణ” - జయదశ్రీ కల్లూర్, Overland Park, KS (ప్రశంసాపత్రం)

“నా మొట్టమొదటి కవిత” - విభాగం విజేతలు

"అంత:కరణ" -రమణి విష్ణుభొట్ల, Austin, TX ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"నీకు దూరంగా" -ప్రియాంక మిరియంపల్లి, Farmington Hills, MI ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"28390 హౌరా మైల్" – నసీమ్ షైక్, Dallas, TX (ప్రశంసాపత్రం)

"చిరునామా"- సుశ్మిత శ్రీరామ్, Rancho Cordova, CA (ప్రశంసాపత్రం)

ఉత్తమ కథానిక విభాగం విజేతలు

"వీసా" - మహేష్ శనగల, Muncie, IN, ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"స్నేహం-ప్రేమ - పి.వి. భగవతి, Lawrenceville, NJ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"జాతక చక్రం"- అపర్ణ గునుపూడి మునుకుట్ల – Palo Alto, CA (ప్రశంసాపత్రం)

"అవసరం- వెల్చేరు చంద్ర శేఖర్ – Ethiopia (ప్రశంసాపత్రం)

"తోటలోకి రాకురా" - రేణుకా అయోల -Houston, TX (ప్రశంసాపత్రం)

ఉత్తమ కవిత విభాగం విజేతలు

"సంభవామి యుగే, యుగే" - స్వాతి శ్రీపాద, Union City, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

""ముద్దుల బాధ్యత ఒక రక్షణ కంకణం-నారాయణ గరిమెళ్ళ, Reston, VA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"అస్తమయం” - మూర్తి మధిర, Portland, OR (ప్రశంసాపత్రం)

"నేనెవర్ని దేవుణ్ణి ప్రశ్నించడానికి"- మద్దూరి శివప్రసాద్, - Poplar Buff, MO (ప్రశంసాపత్రం)


స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీలో పాలొన్న వారందరికీ మరొక్క సారి మా ధన్యవాదాలు. తెలుగులో వ్రాస్తూనే ఉండండి. మంచి అనుభూతిని పొందండి.





















Tuesday, March 15, 2011

ముళ్ళపూడి గారూ - వంగూరి ఫౌండేషనూ...

ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరినీ దు:ఖసాగరంలో ముంచి, ఫిబ్రవరి 24, 2011 నాడు పరమపదించిన ముళ్ళపూడి వెంకట రమణ గారితో సంస్థాగతంగానూ, నాకు వ్యక్తిగతంగానూ పెనవేసుకున్న అనుబంధం ప్రగాఢమైనది. వాటిల్లో అతి ముఖ్యమైనదీ, తెలుగు సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టంగా గుర్తింపబడ్డదీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా జనవరి 1, 2007 నాడు హైదరాబాదులో నిర్వహించిన బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి మహోత్సవం. సుమారు వంద మంది రచయితల ప్రసంగాలతో రెండు రోజుల పాటు దిగ్విజయంగా జరిగిన "మొట్ట మొదటి ప్రపంఛ తెలుగు సాహితీ సదస్సు" లో జరిగిన ఈ సన్మానంలో మొట్టమొదటి సారిగా బాపు-రమణ ల సతీమణులు కూడా పాల్గొనడం ఒక అపురూపమైన విశేషం అయితే, అప్పుడు "జ్ఞాన పీఠ" అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి గారి ప్రసంగం "న భూతో న భవిష్యతి". ఈ సత్కారానికి స్పందన గా స్నేహం అంటే ఏమిటో నిర్వచిస్తూ చేసిన ముళ్ళపూడి గారి క్లుప్తమైన ప్రసంగం వారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.

ఆ వివరాలు ఈక్రింది వీడియో లింకులలో చూడండి.

బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి మహోత్సవం (January 1, 2007)
http://vangurifoundation.org/videos/1stTeluguL/Sanmanam.html

ఆ నాటి చరిత్రాత్మకమైన సాహితీ సదస్సుకు గుర్తింపుగా "ఈ టీవీ" వారి ప్రత్యేక ప్రసారం
http://vangurifoundation.org/videos/1stTeluguL/ETV.html

స్వర్గీయ కోవెల సంపత్కుమారాచార్య, కాళీపట్నం రామారావు గారు, ఎల్లూరి శివారెడ్డి, చాట్ల శ్రీరాములు మొదలైన ప్రముఖుల ప్రసంగాలు:
http://vangurifoundation.org/videos/1stTeluguL/Speeches.html


ఫ్రారంభోత్సవ సభ, ప్రసంగాలు
                http://vangurifoundation.org/videos/1stTeluguL/Inaugural.html

ముళ్ళపూడి గారూ - వంగూరి ఫౌండేషనూ...వ్యాసాలు ఈ క్రింది లింకులో చదవండి.
http://www.koumudi.net/Monthly/2011/march/march_2011_amerikamarshiyal.pdf

http://www.koumudi.net/Monthly/2011/march/march_2011_vyAsakoumudi_ramana.pdf

బాపు గారికీ, ముళ్ళపూడి వారి కుటుంబానికీ ప్రగాఢమైన సానుభూతితో....


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(హ్యూస్టన్, హైదరాబాదు)