Tuesday, January 25, 2011

ఇండియానాపొలిస్ లో ఘనంగా జరిగిన 7వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

అమెరికాలోని పలురాష్ట్రాలనుండి, ఇండియాలొని మన తెలుగునేలనుండి పాల్గొన్న తెలుగు రచయితలు, పండితులు, వక్తలు మరియు భాషాభిమానులతో 7వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఇండియానాపొలిస్ మహానగరంలొ అక్టోబర్ 9, 10 తారీకుల్లో ఘనంగా జరిగింది. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు గ్రేటర్ ఇండియానాపొలిస్ ("గీత") వారి సంయుక్త నిర్వహణలొ ఒక పండుగలాగ జరిగిన ఈ సదస్సుకు సుప్రసిద్ధ్హ రచయిత "పద్మశ్రీ" డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డా. మంథా భానుమతి, డా. అక్కిరాజు సుందర రామక్రిష్ణ, డా. బి.ఎస్. రాములు మరియు టెక్సాస్ రాష్ట్రం నుండి డా. అఫ్సర్ ముఖ్య అతిధులుగా విచ్చేసారు . ఈ సదస్సుకు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు డా. చిట్టెన్ రాజు మరియు "గీత" అధ్యక్షులు డా. అజయ్ పొనుగోటి ప్రధాన నిర్వాహకులుగాను, "గీత" కార్యదర్శి శ్రీ రాము చింతల సంధానకర్తగాను వ్యవహరించారు. "గీత"కు చెందిన డా. ద్వాదశి శర్మ, చంద్రశేఖర్ క్రిష్ణమనేని, మోహన్ దేవరాజు, డా. శివ ప్రసాద్ కుంపట్ల మరియు వినోద్ సాధు ఈ కార్యక్రమ పర్యవేక్షక బాధ్యతలను నిర్వహించారు.

క్లారియన్ హొటెల్ ఆడిటోరియంలో యార్లగడ్డ సుష్మా ఆలపించిన ప్రార్ధనతో, ముఖ్య అతిధులు, ప్రధాన నిర్వాహకులు పాల్గొన్న జ్యోతి ప్రజ్వలనతో వైభవంగా మొదలైన ఈ కార్యక్రమంలో ముందుగా ముఖ్య అతిధులు ఉపన్యసించారు. డా. మంథా భానుమతిగారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో మహిళా రచయిత్రుల పాత్రగురించి, ఆధునికకాలంలొ మహిళా సాహిత్య వైవిధ్యం, పోకడల గురించి, ఆలోచనలకి పదునుపెట్టే రచనల ప్రాముఖ్యతగురించి వివరించారు. ప్రపంచ ప్రఖ్యాతినొందిన వక్త, రచయిత, ఆచార్య డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ "తెలుగునాట తెలుగుభాష, సాహిత్యం" అన్న అంశంపై అత్యద్భుతంగా, సోదాహరణంగా మాట్లాడి ఆహూతులను ఆకట్టుకున్నారు. డా. అఫ్సర్ "ప్రవాస తెలుగు సంస్కృతి - అంతర్జాల సాహిత్యం" పైనా, డా. బి.యస్. రాములు "సైన్స్ ఫిక్షన్, మానవసంబంధాలు" పైన ప్రసంగించారు. పౌరాణిక రంగస్థల నటులు, కవి, డా. అక్కిరాజు సుందర రామక్రిష్ణ తనదైన శైలిలో మధురంగా పద్యాలు పాడుతూ తెలుగులో పద్యసాహిత్యపు మహోన్నత పాత్రను వివరించారు.

వంగూరి ఫౌండేషన్ వారు ఉగాది రచనల పోటీలలొ గెలుపొందినవారికి ఈ సదస్సులో బహుమతి ప్రదానం చేసారు. తరువాత మూడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి నూతన ప్రచురణలు (శ్యామలాదేవి దశిక రచించిన "అమెరికా ఇల్లాలి ముచ్చట్లు", మెడికో శ్యాం రచించిన "శ్యామ్ యానా " కథా సంకలనం, మరియు 42 మంది అమెరికా తెలుగు రచయితల తో కూడిన అమెరికా తెలుగు కధానిక - పదకొండవ సంకలనం), యస్. నారాయణస్వామి రచించిన "రంగుటద్దాల కిటికీ" కథా సంకలనం, డా. ద్వానా శాస్త్రి రచించిన "మన తెలుగు తెలుసుకుందాంఇంగ్లీషు తర్జుమా, ఉమా ఇయ్యుణ్ణి రచనలు, సుధా నిట్టల రచించిన "క్రైస్తవ సంకీర్తనలు -ఒక పరిశీలన" మోహన్ దేవరాజుగారి "వేటూరి" గేయ సంకలనాన్ని ముఖ్య అతిధులు ఆవిష్కరించారు.

సదస్సు రెండవరోజు కార్యక్రమం సాహిత్యప్రసంగవేదికతో మొదలైంది. ఇది శ్రీ బాల కామేశ్వరరావు గారి ఘంటసాల పద్యాలతో మొదలై, ముఖ్య అతిధుల ప్రసంగాలు, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత సాహిత్య వాతావరణంపై వంశీ రామరాజు గారి ప్రసంగాలతో చాలా ఆసక్తిదాయకంగా జరిగింది. ఆ తరువాత జరిగిన కధారచన వేదికలో శ్యామలాదేవి దశిక, యడవల్లి రమణమూర్తి, సత్యవాణి, వంగూరి చిట్టెన్ రాజు మరియు సుధ నిట్టల తమ హాస్యమిళిత, సృజనాత్మక, సందేశాత్మక కధలతో అందరినీ కడుపుబ్బ నవ్వించారు, ఆలోచింపచేశారు.

రెండు విడతలలో జరిగిన స్వీయ రచనా పఠనంలో ఉమా ఇయ్యుణ్ణి, శారదాపూర్ణ శొంఠి, ఆఫ్సర్, సత్యవాణి, ద్వాదశి శర్మ, దేవరాజు మోహన్, కిరణ్ చక్రవర్తుల, శాంతి శ్రీ, రామి రెడ్డి సామా మొదలైన వారు తమ స్వీయరచనలను ఈ వేదికపై చదివి అందరి మన్ననలను పొందారు. ద్వాదశి శర్మ నిర్వహించిన "సరదా ప్రశ్న-జవాబులు", కథ ముగింపు పోటీ, కవితల పోటీ మొదలైన వాటిల్లో సభికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రను సమీక్షిస్తూ, "గీత"కు చెందిన డా. శివ ప్రసాద్ కుంపట్లగారి "జ్ఞానపధానికి తెలుగుపదం" అన్న ఉపన్యాసంతొ ఈ సదస్సు సాహిత్యకార్యక్రమాలు ముగిసాయి.

చివరగా రాము చింతల మరియు "గీత" నిర్వాహకులు ముఖ్య అతిధులకు, వంగూరి చిట్టెన్ రాజు గారికి జ్ఞాపికలను అందచేస్తూ కృతజ్ఞతలను తెలిపారు. డా. శివ ప్రసాద్ కుంపట్ల చేసిన వందన సమర్పణతో ఈ సదస్సు ముగిసింది. శ్రీమతి శారద కోడూరు, శ్రీ అంజనేయ రెడ్డి గారు ఈ సదస్సు వాతావరణానికి తగినట్లుగా, ఇంటిని గుర్తుతెచ్చేటట్లుగా అల్పాహార, భోజనపానీయాలను ఏర్పాటు చేసారు. ఆహూతులు, ముఖ్య అతిధులు సదస్సు నిర్వహణ, సాహిత్యపు ప్రమాణాలు చాల అత్యున్నతస్థాయిలో ఉన్నాయని మెచ్చుకున్నారు. రెండురోజులపాటు ఒక పండుగలాగ, ఒక కుటుంబ కలయికలాగ, ఒక భాషాయజ్ఞంలాగ జరిగిన ఈ సాహితీ సదస్సు అన్నివిధాల విజయవంతమయ్యిందని పలువురు ప్రశంసలు కురిపించారు మరియు ప్రవాసాన జరిగిన ఈ తెలుగు సాహిత్యవేదికను ఒక మరపురాని వేడుకగా అభివర్ణించారు.

ఈ సదస్సులో మరొక ప్రత్యేక కార్యక్రమం "వేగేశ్న ఫౌండేషన్" అధ్యక్షులు శ్రీ వంశీ రామరాజు మరియు వంగూరి చిట్టెన్ రాజుగారు ఏర్పాటుచేసిన "మూడవ ఘంటసాల ఆరాధనోత్సవాలు - 2010". అలనాట సినీసంగీతవిభావరి పేరుతో మొదటిరోజు సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాదుకు చెందిన శ్రీమతి సురేఖామూర్తి మరియు అపర ఘంటసాల శ్రీ బాల కామెశ్వరరావు గార్ల అత్యద్భుత ప్రత్యక్ష గానం అందరినీ సమ్మోహితులను చెసింది.

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ -- å£ÇjŸŒ¢Ã¦ÇŸŒÕ

వంగూరి ఫౌండేషన్, గ్రేటర్ ఇండియానాపొలిస్ తెలుగు ఎసోసియేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 9-10, 2010 తేదీలలో 7వ అమెరికా తెలుగు సదస్సులో అతిథిగా పాల్గొని కీలక ప్రసంగం చేయడం నేను అరుదైన, అపురూపమైన అవకాశంగా భావిస్తున్నాను. రెండు రోజుల పాటు పూరి తెలుగు వాతావరణంలో ఉత్తర అమెరికా తెలుగు రచయితలు, కవులు ఒక చోట సమావేశమై పూర్తి స్థాయి సాహిత్య వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహించడం అసాధారణమైన విషయం. ఉత్తర అమెరికాలోని తెలుగు రచయితలు వారి రచనలు, ఆంధ్ర ప్రదేశ్ లోని రచయితలు వారి రచనలతో ఏ విధంగానూ తీసిపోవని, కొన్నిచోట్ల ఆంధ్ర ప్రదేశ్ లోని రచనలను మించిన స్థాయిలో ఉన్నాయని చెప్పక తప్పదు. ఆహూతులు, అతిథులు సదస్సు నిర్వహణ సాహిత్య ప్రమాణాలు చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. రెండు రోజుల పాటు ఒక పండుగలాగా, ఒక సాహిత్య యజ్ఞంలాగా, ఒక కుటుంబ కలయికలాగా జరిగిన ఈ సదస్సు విజయవంతం అయిందని నా ఉద్దేశ్యం. వంగూరి చిట్టెన్ రాజు గారికి, గ్రేటర్ ఇండియానాపొలిస్ తెలుగు ఎసోసియేషన్ సభ్య్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మంథా భానుమతి, మంథా రామారావు -- å£ÇjŸŒ¢Ã¦ÇŸŒÕ

"అక్టోబర్ 9, 10 తేదీల్లో ఆరున్నొక్క అమెరికా తెలుగు సాహిత్య సభలు.. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మీరు అదేసమయంలో అమెరికాలో ఉంటారు గనుక తప్పక విచ్చేయవలసిందిగా నా కోరిక.."
భవదీయుడు, చిట్టెంరాజు.


మెయిల్లో ఆహ్వానాన్ని చూసి తటపటాయించాను. ఏదో అమలాపురంలో లాగ కాదు కదా అమెరికాలో అంటే. వేల మైళ్ళు వెళ్ళాలి.. అక్కడ ఎవరైనా వాహనం, ఆతిధ్యం ఇవ్వగలగాలి.. అందరివీ బిజీ షెడ్యూల్ లే..
ఇండియనాలోనే సభాస్థలికి మూడుగంటల దూరంలో ఉన్న బాల్యస్నేహితురాలు నిర్మల ధర్మమా అని అనేక రహదారి అడ్డంకుల్ని (రోడ్లు కన్స్ట్రక్షన్లుట.. ఎక్కడికక్కడ డైవర్షన్లు..) దాటుకుని శుక్రవారం సాయంత్రానికే చేరాం. సభలు జరిగే హోటల్లోనే బస.. చిట్టెంరాజుగారు, గీతా నిర్వాహకులు రాము చింతల సాదరంగా స్వాగతం పలికారు.

అప్పట్నుంచీ ప్రతీ క్షణమూ మరపురానిదే. ప్రతీ పరిచయమూ ఆహ్లాదమయినదే!

కమ్మటి ఆంధ్రా వంటకాలు (గోంగూర పచ్చడితో సహా.. చెట్టు కనిపిస్తే చాలు పెరళ్ళలో జొరబడి కోసుకొచ్చేశారుట గీతా సభ్యులు), తీయని తెలుగులో ఛలోక్తులతో సంభాషణలు మరపురాని అనుభూతిని నిలిపాయి మదిలో.
ఒక కుటుంబ సమావేశంలా కలిసిపోయిన ప్రేక్షకులు, ఉపన్యాసకులు.. పండుగకో, శుభకార్యానికో కలిసిన బంధువుల్లా కబుర్లు చెప్పుకున్నారు.

శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, బి.యస్ రాములు, ప్రొఫెసర్ అఫ్సర్ల ఉపన్యాసాలు విజ్ఞానాన్ని పంచగా అక్కిరాజు సుందర రామక్రిష్ణగారి పద్యాలు విజ్ఞానంతో పాటు మధురంగా మనసుని ఆహ్లాద పరిచాయి.
స్వీయ రచనా పఠనాలు, గొలుసుకథల పోటీలు, పద్యాపూరణాలు, క్విజ్లు.. మళ్ళీ విద్యార్ధి దశకి వెళ్ళిన అనుభూతి కలిగింది.

ఆడుతూ పాడుతూ.. జరిగిన ఇండియానాపోలిస్ సభలు ఒక మధురానుభూతిని మిగిల్చాయి. బాలకామేశ్వరరావు, సురేఖామూర్తిల గానం అందరినీ అలరించి మైమరపింపచేసింది.

ఇటువంటిసభలు తెలుగు భాష వైభవాన్ని పదికాలాలపాటు నిలుపుతాయనడంలో సందేహంలేదు.
నిర్వాహకులకి అభినందనలు.

అక్కిరాజు సుందర రామకృష్ణ -- å£ÇjŸŒ¢Ã¦ÇŸŒÕ

అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నిర్వహింపబడుతున్న సంగీత, సాహిత్య, నాటక కార్యక్రమాలు ఒక ఎత్తు, "వంగూరి ఫౌండేషన్" సంస్థ ప్రతీ రెండు సంవత్సరాలకు ప్రముఖ నగరాలలో నిర్వహింఛే కార్యక్రమాలు మరో ఎత్తు. అక్టోబర్ 9-10, 2010 తారీకులలో "వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా"" మరియూ "ఇండియానాపొలిస్ తెలుగు అసోసియేషన్" వారల సంయుక్తాధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు నిస్సంశయంగా ప్రత్యేకతని సంతరించుకున్నాయి.

ఇండియానుంచి ప్రముఖులైన కవులను, సాహితీమూర్తులనూ, నటగాయక శిరోమణులనూ ఆహ్వానిస్తూ, యితోధిక రీతిని సత్కరిస్తూ, "వంగూరి ఫౌండేషన్" చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే. ఈ సారి కూడా, ఆంధ్ర, ఆంగ్ల, హిందీ భాషా విశారదులు శ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారినీ, ప్రముఖ కవి, నట గాయకుడు, విశ్రాంత ఆంధ్రోపన్యాసకుడు డా. అక్కిరాజు సుందర రామకృష్ణ గారి లాంటి వారినీ, ప్రఖ్యాత కథా రచయిత్రి శ్రీమతి డా. మంథా భానుమతి లాంటి వారినీ ఆహ్వానించి సత్కరించడం జరిగింది. "శిరోమణి" వంశీ రామరాజు గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న "వేగేశ్న ఫౌండేషన్" సంస్థ సహాయార్ధం హైదరాబాదు నుంచి విచ్చేసిన శ్రీ బాల కామేశ్వర రావు తాతా గారు, శ్రీమతి సురేఖా మూర్తి గారు అద్భుతమైన పాత సినిమా పాటలు పాడి వినిపించారు.

అమెరికాలో ఉంటున్న సాహితీ ప్రముఖులు అనేకమంది హాజరై తమ, తమ ప్రసంగాలని వినిపించారు. ప్రముఖ "వచన కవి" అఫ్సర్ గారు, శొంఠి శారద, సత్య వాణి, నారాయణ స్వామి, రమణ మూర్తి తదితరుల ప్రసంగాలు, కవితలు శ్రోతలని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండు రోజుల కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. వచ్చిన ప్రేక్షకులకు అన్ని సౌకర్యాలూ అందించడం జరిగింది. డా. డి .హెచ్.ఆర్. శర్మ గారి లాంటి ఇ<డీయానాపొలిస్ ప్రముఖులూ, డా. దేవరాజు మోహన్ లాంటి కార్యకర్తలూ, పొనుగోటి అజయ్, రాము చింతల, శేఖర్ గారలూ, అత్యంత బాధ్యతాయుతంగా కార్యక్రమాలు నిర్వహించారు.

7 « ®¾ŸŒ®¾Õq N¬ä³Ä™Õ Ð £Ã¢hà £¾“AÂŒ™Õ, ƢŽ¢bÙ¢

http://www.andhraprabhaonline.com/search/article-162361

http://www.eenadu.net/archives/archive-10-10-2010/story.asp?qry1=24&reccount=24

http://afsartelugu.blogspot.com/2010/10/blog-post_11.html

http://www.namastheandhra.com/newsdetails.asp?newsid=13438

http://kottapali.blogspot.com/2010/10/blog-post_11.html

http://kottapali.blogspot.com/2010/10/blog-post_12.html

http://kottapali.blogspot.com/2010/10/blog-post_20.html

Andhra Prabha Vanguri

http://premalo-manam.blogspot.com

1 comment:

గీతిక బి said...

ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మన తెలుగు సాహిత్య సుమాల్ని విదేశాల్లోనూ పరిమళింప చేస్తున్న మీ అభిరుచికి ధన్యవాదాలు మరియు తెలుగువారి తరపున కృతజ్ఞతలు...

గీతిక బి