Saturday, November 25, 2017


University of California, Berekeley

అమెరికాలో “ధన్యవాదాలు తెలుపుకునే పండుగ” – Thanks Giving సందర్భంగా

అమెరికాలో  తెలుగు పీఠం (బర్^క్లీకాలిఫోర్నియా లో) ఆవశ్యకత...మీ సత్వర సహాయానికి అభ్యర్ధన...

పరాయి దేశంలో మాతృభాషకి పెద్ద పీట వేసి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం చెయ్యగలిగినది మనం చెయ్యడమే మన కర్తవ్యం.
నేపధ్యం

అమెరికా విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠం నెలకొల్పాలి అనే ఆలోచన ఇప్పటిది కాదు. 1998 లో అట్లాంటాలో జరిగిన మొట్ట మొదటి అమెరికా తెలుగు సాహితీ సదస్సులో తన కీలకోపన్యాసం లో వెల్చేరు నారాయణ రావు గారు తెలుగు భాష సాహిత్యాలని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడం ఇక్కడ విశ్వవిద్యాలయాలలో తెలుగు పీఠాలు నెలకొల్పి ఆయా ఆచార్యులు, అంతర్జాతీయ విద్యార్థుల పరిశోధనల ద్వారా మాత్రమే సాధ్యం అని స్పష్టంగా వివరించారు. డా. గవరసాన సత్యనారాయణ గారు గణాంకాలతో సమగ్రమైన ప్రసంగం చేసి అమెరికాలో విదేశీ భాషగా తెలుగుని గుర్తించడానికి “అమెరికాలో తెలుగు భాష వ్యాప్తి, బోధన, పరిశోధన, ఆధునీకరణలకు వీలుగా తెలుగు పీఠమును స్థాపించ వలయును”  అనే ఏక వాక్య తీర్మానం ప్రవేశ పెట్టారు. ఆ తీర్మానాన్ని పెమ్మరాజు వేణుగోపాల రావు గారు, వేమూరి వెంకటేశ్వర రావు గారు, వంగూరి చిట్టెన్ రాజు సమర్థించగా “అట్లాంటా తీర్మానము” అనే పేరిట అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఆ నాడు అమెరికాలో తెలుగు పీఠం అవసరం పై చర్చించిన విషయాలు ఇప్పటికీ, ఎప్పటికీ అర్థవంతవయినవి, ఆచరణ లో పెట్ట దగ్గవే. కొంత వరకూ ఆచరణ లోకి వచ్చినవి అన్నీ చాలా మటుకు వ్యక్తిగత ప్రయత్నాలే.
ప్రస్తుత విషయం
ఆ నాటి వేమూరి వేంకటేశ్వర రావు గారు కేవలం మాటలతో కాకుండా చేతలతో అమెరికాలో తెలుగు పీఠం సంస్థాపన లో పదేళ్ళు వ్యక్తిగతంగా, నిస్వార్ధంగా ఎంతో కృషి చేసి 2006 వ సంవత్సరం లో బెర్క్ లీ లో ఉన్న ప్రతిష్టాత్మకమైన కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేశారు. ఆ పీఠాన్ని ఇప్పుడు మరింత పటిష్టమూ, శాశ్వతమూ చెయ్యవలసిన కర్తవ్యం నాదీ, మీదీ, మన తెలుగు శాఖని అభివృద్ది పరిచే విషయం మీద ఆ విశ్వ విద్యాలయం లో తెలుగు శాఖ అంతర్భాగం గా ఉన్న South Eastern & South Asia విభాగం ప్రొ. సుచిత సక్సేనా మరియు డైరెక్టర్ ప్రొఫెసర్ మారిస్ ఫరుకీ లతో నేను స్వయంగా కూలంకషంగా చర్చించాను.  సంక్షిప్తంగా చెప్పాలంటే ఇప్పటి దాకా డా. వేమూరి గారి ఏకైక అకుంఠీత దీక్ష వలన ఈ క్రింది విజయాలు సమకూరాయి. ఆయనతో సహకరిస్తూ ఆ పీఠాన్ని మరింత బలపరిచి మున్ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత మనందరిదీ. యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద , అగ్రస్థాయి విశ్వ విద్యాలయాలలో ఒకటైన కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం బెర్కేలీప్రాంగణం లో మన తెలుగు పీఠం వెళ్లి విరియడం తెలుగు వారికి గర్వ కారణం.  
సాధించిన పురోగతి: సంక్షిప్తంగా:
 ·         2006 నుంచి అమెరికాలోబర్^క్లీ లో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో గత పదేళ్లుగా తెలుగు భాషా బోధన - సగటునఏడాదికి రెండు పాఠ్యాంశాలు చొప్పున -జరుగుతోంది. ఒకటి ప్రారంభ తరగతులు. రెండోది మధ్య తరగతులు.
·         తెలుగులో పరిశోధన నిమిత్తం TELSA (దక్షిణ కేలిఫోర్నియాలో ఉన్న ఒక తెలుగు సంఘం) వారు ఇచ్చిన $50,000 తో విద్యార్థి వేతనం కూడా గత ఏడాది నుండి మొదలు అయింది. ఇది కేవలం ఓనమాలు నేర్పించడం కోసం తలపెట్టిన పీఠం కాదు. ఇది కేవలం బర్కలీ ప్రాంగణానికి పరిమితం చెయ్యాలని  తలపెట్టిన పీఠమూ  కాదు. 
·         ఈ పీఠం ఈ  రోజు ఉండిరేపు మూత పడిపోయే వానకాలపు పీఠం కాదుసుస్థిరంగాశాశ్వతంగా నిలవగలిగే స్తోమత సంపాదించుకున్న పీఠం. ఇది తెలుగువారు అంతా కలిసిఉడతా భక్తితోచిన్నా, పెద్దా విరాళాలు ఇచ్చి నిలబెడుతున్న పీఠం! ఏ ఒక్క కుటుంబానికో చెందినది కాదు.
·         వేమూరి గారి నాయకత్వంలో ధన సేకరణ 2006 లో మొదలయింది. అనేక ప్రాంతాల నుండి మిత్రులు నిధులు పోగు చేసి పంపుతూనే ఉన్నారు. ఇప్పటికి $675,000 వరకు నిధుల పోగు చెయ్యడం జరిగింది. ఖర్చులు పోను ప్రస్తుతం శాశ్వత నిధిలో $477,000 ఉన్నాయి. 
మీకు ప్రత్యేక అత్యవసర విన్నపం
బెర్క్ లీ లో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయం లో ఉన్న తెలుగు పీఠం నిర్వాహకుల నిర్దేశం ప్రకారం ఇప్పుడు ఉన్న $477,000 నిదులకి మనం కేవలం మరొక $25, 000 జమ చెయ్యగలిగితే ఆ పీఠానికి మరింత బలం చేకూరుతుంది. ఆ విశ్వ విద్యాలయం ఉన్నన్నాళ్లూ....అంటే వందల సంవత్సరాలు ..అమెరికాలో భావి తరాల తెలుగు, తెలుగేతర విద్యార్థులకీ అక్కడ తెలుగు భాషా బోధన నిరాటంకం గా సాగుతుంది.
మీరు ఇచ్చే విరాళానికి వంగూరి ఫౌండేషన్ వారు, వేణు ఆసూరి గారు చెరొక $5000 వరకూ జత పరుస్తారు. They will match your donation up to $5000 each. ...this year… 2017.
  
అందు వలన ఈ ఏడాది ఆఖరు లోగా...అనగా డిశెంబర్ 31, 2017 లోగా మనం సమిష్టిగా కనీసం $25,000 నిధులు సేకరించి ఆ విశ్వవిద్యాలయానికి అందజేసి ఈ తెలుగు పీఠానికి శాశ్వత స్థాయి కలిగించడానికి మీ ఉదార విరాళాలు అభ్యర్థించడమే ఈ ఉత్తరం సారాంశం. కావలసిన స్థాయికి చేరడానికి ఇచ్చిన వారు మరొక సారి ఇవ్వాలి. కొత్తవారు ఈ క్రతువులో ఉత్సాహంగా పాల్గొని ఈ పనిని పూర్తి చెయ్యాలి.

Donor Recognition by U C, Berkeley
(దాతల గుర్తింపు)
The University has different levels of recognizing donor contributions from very small amount to substantial amounts. .
విరాళం ఎంతా అనే దానితో సంబంధం లేకుండా దాతలు అందరికీ గుర్తింపు మూడు స్థాయిలలో ఉంటుంది.  
One of the most popular category is a special recognition on its web page by South East & South Asian Department for all donors of $5000 or more payable over several years. We strongly encourage your participation in this plan. Again, no amount is too small. 
Suggested Donation Amounts for 2017
$100 to $25,000
How to Donate
Suggested Option 1-
(All donations through VFA are tax-deductible in USA.
(Federal Tax ID: 76-044238)
(All donations qualify for matching funds up to $10,000 from VFA & Venu Asuri)
How this works
You send your donation in any amount on-line or by check as given below. VFA will match your donation up to $5.000 in 2017. In addition, as VFA is qualified to receive matching donations from many companies and you can also apply for a matching donation from your employer.
 VFA will send your contribution & your company match to UC Berkeley Foundation for Telugu Studies in YOUR name.
 You will get a receipt from UC, Berkeley and will be recognized by UC per their policies (attached) and by VFA in its communications on FB and Google member group.   
Donation through VFA on-line using any credit card.
Please click on the following link and donate generously using any credit card.
or
 make check payable to Vanguri Foundation and mail to:
VFA, P.O. Box 1948, Stafford, TX 77497 
Suggested Option 2
Donate Direct to UC, Berkeley Foundation
You can donate on-line directly to University of California, Berkeley by clicking on the following link

or please fill the attached Pledge Card and send it directly to UC, Berkley as instructed.

Please donate generously to support Telugu Studies at the prestigious University of California, Berkeley.

For More Details, Please contact the following:

Prof. Rao Vemuri 
Phone: 650 793 8458: E-mail:  rvemuri@gmail.com

Vanguri Chitten Raju

 ఎందరో తెలుగు విద్యాదాన కర్ణులు.. అందరికి వందనాలు!!



No comments: