Friday, December 30, 2016





అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, పీఠికాపురాధీశ ప్రభుత్వ కళాశాల (కాకినాడ)
సంయుక్త నిర్వహణలో
రెండవ
యువతరం జాతీయ తెలుగు సాహిత్య సమ్మేళనం
ఫిబ్రవరి 11, 2017 (శనివారం)
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల దాకా
సభా ప్రాంగణం
పి.ఆర్. గవర్నమెంట్ కాలేజ్ (Autonomous)
రాజా రామ్ మోహన్ రాయ్ రోడ్, రామారావు పేట
కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్
నేపధ్యం:
తెలుగు సాహిత్య చరిత్రలో బహుశా మొట్టమొదటి సారిగా, కేవలం యువతీ యువకులకు మాత్రమే ప్రాధాన్యత కలిగిస్తూ వారిదే అయిన ఒక సాహిత్య వేదికను ఆవిష్కరిస్తూ అక్టోబర్, 2013 లో హైదరాబాదులో వారం రోజుల పాటు జరిగిన "మొట్టమొదటి యువ తరం తెలుగు సాహిత్య సమ్మేళనం" లో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి సుమారు 250 మంది తెలుగు యువత పాల్గొని చరిత్ర సృష్టించిన సంగతి అందరికీ తెలిసినదే.
ఆ  యువతరం సాహిత్య సమ్మేళన సాంప్రదాయాన్ని కొనసాగించే సదుద్దేశ్యంతో 132 సంవత్సరాలగా తెలుగు భాషా, సాహిత్య వికాసంలో విశిష్టమైన స్థానాన్ని పొందిన కాకినాడ పి.ఆర్. కాలేజ్ తెలుగు విభాగం వారి సహకారంతో “రెండవ యువ తరం జాతీయ స్థాయి తెలుగు సాహిత్య సమ్మేళనం” రాబోయే ఫిబ్రవరి 11, 2017 నాడు ఆ కళాశాల ప్రాంగణంలో జరుగుతోంది.  రోజంతా జరిగే ఈ అపురూప యువతరం సాహిత్య సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే.
రెండవ యువతరం సాహిత్య సమ్మేళన ప్రధాన ఉద్దేశ్యాలు
1. తెలుగు యువ రచయితలు, సాహిత్యాభిలాషులూ అనేక ప్రాంతాలనుంచి వచ్చే తోటి యువ సాహితీవేత్తలని కలుసుకుని, కొత్త పరిచయాలు పెంచుకోవడం. తెలుగు భాషా, సాహిత్యాలపై తమ మక్కువ చాటుకోవడం, ప్రస్తుతం ఉన్న పరిచయాలని మరింత పటిష్టం చేసుకోవడం.
2. యువతరం తెలుగు రచయితలు తమ స్వీయ రచనలను సభాముఖంగా వినిపించి ఇతరులతో పంచుకోడం.
3. తెలుగు భాషా సాహిత్యాల విషయాలని సమీక్షించుకోవడం, సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించుకోడం.
4. భవిష్యత్తులో భాష మనుగడకి, సాహిత్య వికాసానికీ, పురోగతికీ ప్రభుత్వానికి తగిన సూచనలు చేయడం, ప్రభుత్వేతర మార్గాలను అన్వేషించుకోవడం.
తెలుగు భాషా, సాహిత్యాభిమానులకు సాదర ఆహ్వానం
 ఆర్ధిక పురోభివృద్డికీ, ఉద్యోగావకాశాలకీ ఆంగ్లం మాత్రమే అవసరం అనీ, అంతే కాక తెలుగు ప్రతిబంధకం అనే అపోహకి ఆజ్యం పోస్తున్న ప్రభుత్వ విద్యావిదానాలూ,  తద్వారా మన భాషా, సాహిత్యాల పట్ల తెలుగు వారి నిరాసక్తతా ఈ రోజుల్లో అందరూ గమనిస్తున్నదే.  అపురూపమైన మన భాషా సాహిత్యాలకి వెన్నెముకగా నిలిచి, భవిష్యత్తుని దేదీప్యమానంగా తీర్చి దిద్ది, తద్వారా మన సంస్కృతిని కాపాడే గురుతర బాధ్యత ఈ నాటి యువతరానిదే.
అందువలన కళాశాల విద్యార్ధులూ, సుమారు 35 సంవత్సరాల లోపు వయస్సు గల రచయితలూ, కవులూ, సాహిత్యాభిలాషులూ, తెలుగు భాషాభిమానులు మాత్రమే వేదిక పై పాల్గొనే విధంగా ఈ “రెండవ యువ తరం జాతీయ స్థాయి తెలుగు సాహిత్య సమ్మేళనం” రూప కల్పన చేస్తున్నాం.
వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఈ మహాసభలకి ఆహ్వానితులే.
యువతరం వక్తలకు ఆహ్వానం
(వయో పరిమితి సుమారు 18 నుంచి 35 సంవత్సరాలు)
సాహిత్యపరమైన విషయాలపై ప్రసంగించి, తమ అభిప్రాయాలను ఇతర రచయిత్రులూ, సాహిత్యాభిమానులతో పంచుకోవాలని అభిలషించే తెలుగు యువతీ యువకులందరినీ ఈ సమ్మేళనానికి వచ్చి తమ వంతు క్రియాశీలక పాత్ర పోషించమని ఆహ్వానిస్తున్నాం. వివరాలు ఈ క్రింద పొందుపరిచాం.
 కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్ధులకు, ఆచార్యులకు ప్రత్యేక ఆహ్వానం
ఆంధ్ర ప్రదేశ్ లోనూ, ప్రపంచవ్యాప్తంగానూ తెలుగు భాషా, సాహిత్యాలను అధ్యయనం చేస్తున్న కళాశాల మరియు విశ్వవిద్యాలయ విదార్ధులను మహాసభలకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. తమ తెలుగు శాఖలనుండి ఎంపిక చేసి మహా సభలకు ప్రతినిధులుగా పాల్గొనే అవకాశాన్ని కలిగించమని తెలుగు ఉపాధ్యాయులనూ, ఆచార్యులను కోరుతున్నాం.
వక్తలకు సూచనలు, నిబంధనలు
1.     ఈ సమ్మేళనంలో ప్రసంగించదల్చుకున్న యువతీ, యువకులు (సుమారు 18 -35 వయసు) విద్యార్ధులు ఇరవై పంక్తులు మించకుండా తమ సంక్షిప్త ప్రసంగ వ్యాసం తెలుగులో ‘టైప్’ చేసి కేవలం యూనికోడ్, PDF లలో కానీ స్కాన్ చేసి JPEG లో కానీ ఇమెయిల్ లో మాత్రమే మాకు పంపించమని కోరుతున్నాం. తపాలా లో కానీ మరేవిధంగా కానీ అంగీకరించబడవు.
2. వక్తలు మాకు విధిగా పంపించవలసినవి:
·         ప్రసంగ వ్యాసం (ఇరవై పంక్తుల లోపుగా సంక్షిప్త వ్యాసం)
·         పూర్తి పేరు, చిరునామా
·         పాస్ పోర్ట్ సైజు ఫోటో
·         ఫోన్ నెంబర్
·         ఈ మెయిల్ చిరునామా
·         వయస్సు దృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్, స్కూల్ రికార్డ్, పాన్ కార్డ్, పుట్టిన తేదీ సూచించే తదితర పత్రాలు మొదలైన వాటిల్లో కనీసం ఒకటి)  
3.  పై వివరాలు అన్నీ ఒకే సారి మాకు చేరవల్సిన ఆఖరి తేదీ జనవరి 20, 2017.
4, జనవరి 20, 2017 లోగా మాకు చేరి, అంగీకరించబడినవి మాత్రమే “సభా విశేష సంచిక’ లో ప్రచరించబడతాయి.  
పై వివరాలు మాకు పంపించవలసిన ఇమెయిల్ చిరునామాలు
bollojubaba@gmail.com, Phone: 98493 20443
&
Vanguri Chitten Raju
E-mail: vangurifoundation@gmail.com
5. అందిన అన్ని ప్రతిపాదనలూ, రచనలూ పరిశీలించి, ఎంపికైన వక్తలకు మాత్రమే, వెనువెంటనే, కానీ, ఫిబ్రవరి 1, 2017 లోపుగా కానీ తెలియపరుస్తాం.
6. వ్యక్తిగత ప్రసంగాలకు 5 – 10 నిముషాలు, చర్చా వేదికలకు 30 నిముషాలు కేటాయించబడతాయి. ఈ సమయ నిబంధనలు ఖచ్చితంగా పాటించబడతాయి, అందు వలన వక్తలని ముందుగానే తమ ప్రసంగాలని ఆ కాల పరిమితిలో ఉండేలా తయారు చేసుకుని, ‘రిహార్సల్’ చేసుకుని, సహకరించమని కోరుతున్నాం.
7.ఎంపిక అయిన అన్ని ప్రాంతాల వక్తలకు ఒక జ్ఞాపిక, 500 రూపాయల పారితోషికం, ప్రశంసా పత్రం సభా ముఖంగా అందజేయబడతాయి. ఎంపిక అయిన తరువాత సభకు రాని వక్తలకు ఇది వర్తించదు.   
8. అన్ని విషయాలలోనూ తుది నిర్ణయాలు నిర్వాహకులవే.      
యువతరం ఉత్తమ రచనల పోటీ

Last Date to receive entries is:  January 25, 2017

ఈ యువతరం సాహిత్య సమ్మేళనం సందర్భంగా “యువతరం ఉత్తమ రచనల పోటీ” నిర్వహిస్తున్నాం. కేవలం 18-35 సంవత్సరాల వయో పరిమితిలో ఉన్న వారు మాత్రమే ఈ పోటీలో పాల్గొనడానికి ఆహ్వానితులు.
పోటీ వివరాలు ఈ క్రింద పొందుపరిచాం.
ఉత్తమ కథ:  రెండు సమాన బహుమతులు (ఒక్కొక్కటీ రూ. 1, 116)
రెండు ప్రోత్సాహక బహుమతులు: (ఒక్కొక్కటీ రూ. 508)
ఉత్తమ కవిత: రెండు సమాన బహుమతులు (ఒక్కొక్కటీ రూ. 1, 116)
రెండు ప్రోత్సాహక బహుమతులు: (ఒక్కొక్కటీ రూ. 508)
ఉత్తమ సాహిత్య విశ్లేషణ వ్యాసం: రెండు సమాన బహుమతులు (ఒక్కొక్కటీ రూ. 1, 116)
రెండు ప్రోత్సాహక బహుమతులు: (ఒక్కొక్కటీ రూ. 508)
విజేతలందరికీ నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం సభా ముఖంగా మాత్రమే బహుకరించబడతాయి. సభా ముఖంగా అందుకోలేని వారి బహుమతులు ఉపసంహకరించబడతాయి.    
యువతరం ఉత్తమ రచనల పోటీ అన్నింటికీ ముఖ్య గమనికలు
·    ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును.
·    తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
·         రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి.
·         విజేతల వివరాలు ఫిబ్రవరి 1, 2017 నాడు కానీ  అంతకు ముందు కానీ   ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ తేదీ లోపుగా తమ ఎంట్రీలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
·    విజేతల ఎంపికలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries for this creative literary is:  January 25, 2017
Please send entries by e-mail attachments only (PDF, JPEG or Unicode fonts)

రచనల పోటీ ప్రధాన నిర్వాహకులు: డా. వేదుల శ్రీరామ శర్మ (శిరీష)
ఫోన్: 94938 38038,
&
vangurifoundation@gmail.com & sairacha@gmail.com
సాహిత్య ప్రతినిధులకు సూచనలు, నిబంధనలు

·         వక్తలతో సహా ఈ సభలకు విచ్చేసిన వారందరూ, “సాహిత్య ప్రతినిధులు” గా గుర్తించబడతారు. ప్రవేశ రుసుము: కేవలం 100 రూపాయలు మాత్రమే (ప్రతి ఒక్కరికీ).
·         సభా ప్రాంగణం లో “నమోదు బల్ల” (Registration Desk) దగ్గర మాత్రమే ప్రవేశ రుసుము కేవలం నగదు రూపంలో స్వీకరించబడుతుంది. అంతకు ముందు మరే “స్మార్ట్” పద్ధతుల రూపంలో కానీ, చెక్కుల రూపంలో కానీ అంగీకరించబడదు.
సాహిత్య ప్రతినిథులకి సమకూరే లాభాలు
కేవలం 100 రూపాయల ప్రవేశ రుసుము చెల్లించిన వారు అందుకునే లాభాలు ఈ క్రింద పొందు పరచ బడ్డాయి.
1.     ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఫలహారం
2.    సభా విశేష సంచికతో సహా కొన్ని మంచి తెలుగు పుస్తకాలు
3.    కళాశాల, విశ్వ విద్యాలయాల విద్యార్థులు, ఆచార్యులకి, కావలసిన వారికీ ఈ సభలలో పాల్గొన్న నిర్థారణ పత్రం. అనగా...Certificate of Participation.
4.    ఒక రోజంతా వెలకట్ట లేని సాహిత్య వీనుల విందు, నూతన పరిచయాలు, సాహిత్యం పై ఆసక్తి, అనురక్తి, అవగాహన, ప్రజ్ఞా పాటవాలు గల యువతీ యువకులతో అనిర్వచనీయమైన అనుబంధం.
Request for Financial Support
If you feel that this unique non-profit convention of young Telugu writers costing about Rs.3 Lakhs is worthy of your support, please donate generously as follows;
How to Donate in India
(Net Transfer)
Account Name: Vanguri Foundation of America
Bank Name: Andhra Bank, Bag Amberpet Branch, Hyderabad
Account Number: 013210011015533
ISFC Code: ANDB000132
Hot to donate in USA
(All donations are tax-deductible in USA)
Please click or copy paste the following in your URL and follow prompts.
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=3R29K3F2QREMQ

వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి.
కార్య నిర్వాహక వర్గం
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా  (వంగూరి  చిట్టెన్ రాజు, అధ్యక్షులు)
 (vangurifoundation@gmail.com, USA & WhatsApp Phone: +1 832 594 9054)
P.R. Govt. College (Autonomous) Dr. Krishna Chappidi (Principal)
                                               Kakinada.jkc@gmail.com                 
Convenor (సంచాలకులు)
Dr. Harirama Prasad
(Head of Telugu Department, P.R. Govt. College)
Phone: 94403 40057, E-mail: hrp.pasupuleti@gmail.com
Chief Editor (Souvenir) (సభా విశేష సంచిక ప్రధాన సంపాదకులు)
Sri Bolloju Baba
(Faculty, P.R. Govt. College)
Phone: 98493 20443, E-mail: bollojubaba@gmail.com
యువతరం సంచాలకులు
డి . శ్రీదేవి: nayakasri@gmail.com   గంగాభవాని: Pepakayala.gangabhavani@gmail.com 
కార్యనిర్వాహక వర్గం  

సుచిత్ర బాలాంత్రపు (సభా నిర్వహణ)
K.S. B. R. Prakash (Logistics & Arrangements)
సలహా మండలి
Y.S.N, మూర్తి, వంశీ రామరాజు
శాయి రాచకొండ (అమెరికా)





                                     

No comments: