Monday, July 1, 2013

18వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

18 ఉగాది ఉత్తమ రచనల పోటీ
విజేతల ప్రకటన
"శ్రీ విజయ నామ సంవత్సర ఉగాది ( ఏప్రిలు 11, 2013) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 18 ఉగాది ఉత్తమ రచనల పోటీ లో క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ అధిక సంఖ్యలో అనేక దేశాలనుండి  చాలా మంది ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ పాల్గొనడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసిన రచయితలకు మా ధన్యవాదాలు. వారి సాహిత్య కృషికి మా అభినందనలు. విజేతలుగా ఎంపిక అయిన రచనలతో బాటు, ఇతర మంచి రచనలను వీలును బట్టి ప్రచురించే ప్రయత్నం చేస్తాం. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే.

బహుమతి పొందిన రచనలూప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టికేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.

   “నా  మొట్టమొదటి కథ” - విభాగం విజేతలు
వాసన ”: శ్రీముహ, నార్వుడ్, మెసాచుసెట్స్, యు ఎస్   ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
 “కార్పోరేట్ సుడిగుండాలు ”: వెంకట రమణ మూర్తి, కప్పగంతుల, సికింద్రాబాద్, ఆంధ్ర ప్రదేశ్, ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
దయామణి”: శ్రీనివాసరావు ఆదూరి, ఆంధ్ర ప్రదేశ్ (ప్రశంసాపత్రం)

నా  మొట్టమొదటి కవిత” - విభాగం విజేతలు
అర్థాలు చెరిపేసిన అనర్థం సంగతి”: సుజాత బుచ్చిబాబు, చోడవరం, ఆంధ్ర ప్రదేశ్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
చాయ్ : గోషికా ప్రణతి, నిజామాబాద్, ఆంధ్ర ప్రదేశ్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

ఉత్తమ కథానిక విభాగం విజేతలు
సవ్యాజ మానవులు" - ఎలెక్టాన్, హనుమ కొండ, ఆంధ్ర ప్రదేశ్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"ద్వంద్వం"-  శ్రీదేవి మురళీధర్, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్ -($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"దిగుడు బావి" - సత్యదేవ్ చిలుకూరి, హ్యూస్టన్, టెక్సాస్, యు ఎస్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"తెగులు బ్లాగు"- ఆర్ శర్మ దంతుర్తి (ప్రశంసాపత్రం)
ఉత్తమ కవిత విభాగం విజేతలు
"అష్టవిధ నాయికలు"- రాధిక నోరి, టాలహాస్సె, ఫ్లారిడా, యు ఎస్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
విజయోత్సాహం: జి.వి. యస్. నాగేశ్వర రావు, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)
"భవిత బాట"- ర్యాలి ప్రసాద్కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్ (ప్రశంసా పత్రం)
నిరంతరంగా మిగలాలి”: నరసింహ స్వామి, (ప్రశంసా పత్రం)


రచనల పోటీలో పాలొన్న వారందరికీ మరొక్క సారి  మా ధన్యవాదాలు. తెలుగులో వ్రాస్తూనే ఉండండి. మంచి అనుభూతిని పొందండి.


No comments: