Thursday, January 8, 2015

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ రచయితలకు ఆహ్వానం

20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం
                           (రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 12015)                          

గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూరాబోయే "మన్మధ నామ సంవత్సర ఉగాది (మార్చ్ 212014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.
ప్రధాన విభాగం – 20వ సారి పోటీ నిర్వహణ
ఏ వయస్సు వారైనాఏ దేశంలో ఉన్నాతెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $58

మొట్ట మొదటి రచనా విభాగం” -6 వ సారి పోటీ నిర్వహణ
కథకవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నాచిన్న ప్రయత్నాలు చేసినాఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆరవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండాప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
"నా మొట్ట మొదటి కథ": (ఉత్తమ కథ):  $116
"నా మొట్టమొదటి కవిత": (ఉత్తమ కవిత): $58
యువతరం విభాగం- 2 వ సారి నిర్వహణ
ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రంకళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.
ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $116
                ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులుఒక్కొక్కటీ $58

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
·    ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
·    తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
·         రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
·    బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
·         విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు కాని, అంతకు ముందు కానీ  (మార్చ్ 21, 2015) ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
·    విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is:  March  1, 2015
Please send entries by e-mail attachments (PDF, JPEG or Unicode fonts)

భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్ & హైదరాబాద్
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com



No comments: