అమెరికాలో
“సిరివెన్నెల” అంతరంగం “ ఆవిష్కరణ ఉత్సవాలు
సిరివెన్నెల రచించిన సినీ గీతాల గాన లహరి కార్యక్రమాల వివరాలు
సాదర ఆహ్వానం
ఒక అసాధారణ సినీ గేయ రచయిత “అంతరంగం”
ఆవిష్కరించడం అంత సులభం కాదు. ఆ రచయితకి కూడా తగిన హృదయ స్పందన, “స్ఫూర్తి”
కలిగితేనే బహిరంగ వేదికల మీద, వ్యక్తిగతంగా తనని తాను నిర్వచించుకోగలుగుతాడు.
అమెరికా తెలుగు వారి అదృష్టం పండి, అటువంటి ఒక అపురూప “అంతరంగ ఆవిష్కరణ” రాబోయే నాలుగు
వారాలలో, ఆరు అమెరికా నగరాలలో జరగబోతోంది.
ఆ సభలు ప్రేక్షకులని సమ్మోహనాస్త్రం లా
కట్టిపడేస్తాయి.
ఆ “సమ్మోహనాస్త్రం” పేరు “సిరివెన్నెల” సీతారామశాస్త్రి.
“సిరివెన్నెల” గారి వ్యాఖ్యానంతో ఆయన రచించిన పాటలు
పాడే వారు సుప్రసిద్ధ గాయకులు పార్థు మరియు సాహితి. ఈ అపురూప సినీ గాన లహరి కార్యక్రమం పేరు “సిరివెన్నెల” అంతరంగం”.
ఈ పత్రంతో పాటు అమెరికాలో జరగబోయే అన్ని కార్యక్రమాల వివరాలు ఈక్రింద
పొందు పరిచాం. స్థానిక కార్యకర్తలని
పిలిచి పూర్తి వివరాలు తెలుసుకుని తప్పకుండా వెళ్లి ఆనందించండి. సిరివెన్నెల
గారిని పలకరించండి.
క్రిందటి వారం మా హ్యూస్టన్ లో జరిగిన కార్యక్రమం ఫోటో ఈ క్రింద చూడవచ్చును.
ఈ కార్యక్రమాల “స్పూర్తి”
పేరు “విశ్వనాదామృతం”.
ఒక అసాధారణ దర్శకుడి చలన చిత్ర జీవిత సందర్శనం......ఆయా చిత్రాల నిర్మాణంలో ఆయన సృజనాత్మక శక్తి కి అక్షర
దానం, గాత్ర దానం, నటనా కౌశలం, సాంకేతిక పరిజ్జానం, ఆయన చిత్ర నిర్మాతలుగా ఆర్ధిక
పరిపుష్టినీ అందించిన హేమా హేమీలు ఆత్మీయంగా వెలువరించిన అభిప్రాయాలతో....అందరికన్నా
ముఖ్యంగా ఆయనే స్వయంగా ఇప్పటి దాకా ఎవరికీ తెలియని విశేషాలని మనతో పంచుకున్న ఒక
అపురూపమైన ప్రయత్నం..ఒక ధారావాహికలా బుల్లి తెర మీద ఆయన చలన చిత్ర చరిత్రని
పదిలపరిచే ప్రయత్నం.... మా హ్యూస్టన్ లో గత ఏడాది ప్రారంభం అయింది. ఆ దిగద్దర్శకులు “కళాతపస్వి” శ్రీ కె విశ్వనాథ్ గారు. ఆయనే నామకరణం చేసిన ఆ టీవీ ధారావాహిక
పేరు “విశ్వనాదామృతం”.
అవును...విశ్వ”నాదామృతం”.... అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న “సిరివెన్నెల” అంతరంగం కార్యక్రమాల నిర్వహణకి అదే “స్పూర్తి”.
మొత్తం 36
ప్రత్యేక ఎపిసోడ్స్ గా ఈ ధారావాహిక నిర్మాణం గత ఆరు నెలలాగా చక చకా సాగుతోంది. ఈ
ధారావాహికకి ఏంకర్ సుప్రసిద్ధ గాయకుడు పార్థు. ఇప్పటి దాకా అక్కినేని, అల్లు
అరవింద్, వెంకటేష్, మొదలైన అసంఖ్యాక అతిరథ మహారధులు విశ్వనాథ్ గారి దర్శకత్వ శైలి గురించీ, ఆయా సినిమాల గురించీ తమ అభిప్రాయాలని తెలుపగా, విశ్వనాథ్ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమకి అందించిన సాహిత్య వరం “సిరివెన్నెల సీతారామ శాస్త్రి” గారు వెన్నుండి ఈ మహత్కార్యానికి తమ సహాయ సహాకారాలు అందిస్తున్నారు.
హ్యూస్టన్ లో శాయి రాచకొండ, సిరివెన్నెల, వంగూరి చిట్టెన్ రాజు, రామ్ చెరువు,
ఈ ధారావాహిక నిర్మాణం
లో మాతో “ప్రయాణం” చెయ్యదల్చుకున్న వారు Ram Cheruvu, Phone: 832 754 7802
(E-mail: ramteja@gmail.com) ని సంప్రదించండి. లాభా పేక్ష లేని మా నిర్మాణ సంస్థ పేరు శృతి లయ క్రియేషన్స్.
ధన్యవాదాలతో
వంగూరి చిట్టెన్
రాజు
వంగూరి ఫౌండేషన్
ఆఫ్ అమెరికా
ఫోన్: 832 594
9054
కార్యక్రమాల వివరాలు
Chicago:
June 21, 2014: (Tristate
Telugu association & TANA: Contact:
Dr. Jampala Chowdary ---- విజయవంతంగా జరిగిన కార్యక్రమం.
Houston:
June 22, 2014: “విశ్వనాదామృతం”
బృందం Contact: Ram
Cheruvu (832 754 7802) & Vanguri Chitten Raju (832
594 9054)-- విజయవంతంగా జరిగిన కార్యక్రమం.
Dallas: June
28, 2014: Contact: TanTex
Contact: Vijay
Kakarla & Narasimha Reddy Urumindi
Austin:
June 29, 2014:
“విశ్వనాదామృతం” బృందం & TCA, Austin Contact : Ravi Kishan Pothukuchy, Austin, TX
Atlanta:
July 5, 2014
: 2nd NATA
Convention Contact: NATA
Convention Committe
Los Angeles: July 12, 2014: LATA : Contact
: Ramesh Kotamurthy & Hari Madala
Bay
Area, California: July 19, 2014: Contact : Venkat Konda
& Anand Kuchibhotla
Salt Lake City : July 20, 2014: Salt Lake City Telugu Association: Contact : Diwakar
No comments:
Post a Comment