Friday, February 19, 2016

తాజా ప్రచురణలు


ఉత్తర అమెరికాలో
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా  తాజా ప్రచురణలు
మీకు శ్రమ లేకుండా మీ ఇంటికే ఇప్పుడు లభ్యం  
ఈ రోజుల్లో తెలుగు పుస్తక ప్రచురణ, పంపిణీ ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం అందరికీ తెలిసినదే. అయినప్పటికీ రచయితలని ప్రోత్సహించడానికీ, ఉత్తర అమెరికాలో ఆసక్తి ఉన్న పాఠకులకి శ్రమ లేకుండానే వారి ఇంటికే మంచి తెలుగు పుస్తకాలు అందించడానికీ గత ఇరవై రెండు  సంవత్సరాలగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరఫున లాభాపేక్ష లేకుండా ఇప్పటి దాకా 61 తెలుగు పుస్తకాలు ప్రచురించాం.

గత మూడు నెలలలో మేము ప్రచురించిన మూడు అపురూపమైన తెలుగు పుస్తకాలు, అమెరికాలో రికార్డు చేయబడిన మొట్ట మొదటి జానపద గేయాల CD ఇప్పుడు ఉత్తర అమెరికాలో పంపిణీకి అందుబాటులో ఉన్నాయి. ఈ  పుస్తకాల రూప కల్పన, కూర్పు, ముద్రణ,  ఇండియా నుంచి ఇక్కడికి రవాణా ఖర్చులు, CD తయారీ వెరసి మాకు సుమారు $5,800 ఖర్చు అయింది.
                         
మీ ఆర్ధిక, నైతిక ప్రోద్బలమే మాకు నిరంతర స్ఫూర్తి అని సవినయంగా మనవి చేసుకుంటూ, మీరు చదివి ఆనందించడానికి ఈ క్రింది మూడు తాజా ప్రచురణలూ, హాయిగా వినడానికి CDలు మీ ఇంటికే తెప్పించుకోడానికి లాభాపేక్ష లేని మా సంస్థకి మీకు తోచిన విరాళం ఇచ్చి మీ ప్రోత్సాహాన్ని అందించమని అర్థిస్తున్నాం. తపాలా ఖర్చులు మావే (సుమారు $15 విలువ).
పుస్తకాల వివరాలు
ప్రచురణ సంఖ్య: 61
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు -2 - శ్యామలా దేవి దశిక కథల సంపుటి
(
బాపు గారి అందమైన ఇల్లాలి ముఖ చిత్రంతో అమెరికా ఇల్లాలి రోజు వారీ అనుభవాలని ఆహ్లాదంగా కబుర్లు చెప్తున్నట్టు కథలు అల్లిన అమెరికా ఇల్లాలి ముచ్చట్ల రెండో సంపుటి. హాయిగా చదువుకుని ఆనందించదగ్గ మంచి పుస్తకం) -28 కథలు -164 పేజీలు – కనీస విరాళం: $25 (పోస్టేజ్: $6.50)

మా షష్టి పూర్తి ప్రచురణ: 60
అసమాన అనసూయ” – నా గురించి నేనే 
కళా ప్రపూర్ణ “ డా. అవసరాల వింజమూరి అనసూయా దేవి గారి 95 సంవత్సరాల ఆత్మ కథ. 1920 లో కాకినాడ లో జన్మించి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న అసమాన విదూషీ మణి తెలుగు సంగీతంలో భావ గీతాలకి, లలితా సంగీతానికి, జానపద గేయాలకి బాణీలు కట్టి సభా గౌరవం కలిగించిన తొలి గాయని. దక్షిణ భారత దేశంలో తొలి మహిళా సినీ సంగీత దర్శకురాలు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనకోడలు అయిన ఆమె సమగ్ర జీవితానుభవాలు, సంగీత ప్రపంచంలో సాధించిన అనితర సాధ్యమైన విజయాలు రంగరించి వంగూరి ఫౌండేషన్ వారి ప్రోత్సాహంతో రచించిన ఆత్మకథ. అందరూ చదివి తీరవలసిన అపురూపమైన జ్ఞాపకాల, ఫోటోల, ప్రముఖుల ఆటోగ్రాఫ్ ల చారిత్రక గ్రంధం.-
శతాధిక కలర్ ఫోటోలు -225 పేజీలు-  కనీస విరాళం: $35  (పోస్టేజ్: $6.50)
అనుబంధం: (పాటల సీడీ): అలనాటి జానపద సామ్రాజ్ఞి అనసూయా దేవి గారు 1978 లో హ్యూస్టన్ వచ్చినప్పుడు అమెరికాలో వెలువరించిన మొట్ట మొదటి 78 rpm రికార్డు CD ఈ అద్వితీయమైన “అనసూయ గారి అసమాన ఆత్మకథ”  కి అనుబంధం. –కనీస విరాళం: $10
 
ప్రచురణ # 59: :”కలికి కథలు”- వెంపటి హేమ సమగ్ర సంపుటి 
గత అనేక దశాబ్దాలగా ఇండియాలోనూ, అమెరికాలోనూ ఉండగా రచించి, తెలుగు నాట & అమెరికాలో  అనేక పత్రికలలో ప్రచురించబడిన 50 వైవిధ్యమైన కథలు సమగ్ర సంపుటిగా ప్రచురించబడిన "కలికి కథలు" సుమారు 650 పేజీల బృహత్ గ్రంధం.-కనీస విరాళం: $35 (పోస్టేజ్: $6.50)

Suggested Donation Categories
(దాతలందరికీ అదనపు బహుమతిగా మరో రెండు పాటల CD లు పంపించబడతాయి)
మహారాజ పోషకులు : $200
రాజ పోషకులు: $100
(All donations are tax-deductible in USA)
Federal Tax ID: 76-0444238
How to Donate
There are two ways you can donate and support our literary activities and book publication.

ON LINE with Credit Card
Please click on the following link or copy paste in your URL and follow the prompts.


By CHECK
Make check payable to VFA and mail to
                                   Vanguri Foundation of America          
P O Box 1948
Stafford, TX 77497

For More details, please contact:
Chitten Raju Vanguri
Cell Phone: 832 594 9054

ముఖ్య గమనిక
ఈ మూడు పుస్తకాలూ ఇండియాలో ఈ క్రింది బుక్ షాపులలో దొరుకుతాయి.
నవోదయా (హైదరాబాద్) ఫోన్: 040-24652387
తెలుగు బుక్ హౌస్: Phone: 92474 46497

సాయి వెంకట రమణ బుక్ డిస్త్రిబ్యూటర్స్: Phone: 96767 99500

No comments: