Tuesday, March 29, 2011

16 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతల ప్రకటన

"శ్రీ ఖర" నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 4, 2011) శుభాకాంక్షలతో 
 
"శ్రీ ఖర" నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 4, 2011) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 16వ ఉగాది ఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు. ఈ పోటీలో పాలుపంచుకుని, విజయవంతం చేసిన ఇంచుమించు ఎనభై మంది రచయితలకు మా ధన్యవాదాలు.

ఈ పోటీలోని అన్ని ప్రక్రియలలోనూ అమెరికా, కెనడా, కెన్యా, ఇథియోపియా, ఐరోపా దేశాలనుండి చాలా మంది రచయితలు పాల్గొనడం ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ సంవత్స్రరం లో ప్రవేశ పెట్టిన "నా మొట్టమొదటి కవిత" ప్రక్రియకీ, రెండవ సారి నిర్వహించిన "నా మొట్టమొదటి కథ" ప్రక్రియకీ చాలా మంది సరికొత్త కవులూ, కథకులూ పాల్గొనడం విదేశాలలో తెలుగు సాహిత్య వికాసానికి శుభసూచకం. విజేతలుగా ఎంపిక అయిన రచనలతో బాటు, ఇతర మంచి రచనలు "కౌముది.నెట్" అంతర్జాల పత్రిక, మరియు "రచన" మాస పత్రిక (హైదరాబాదు) లోనూ ప్రకటించబడతాయి. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే.

బహుమతి ప్రదానం జూలై 16-17, 2011 వ తారీకులలో హ్యూస్టన్, టెక్సస్ లో జరగబోయే ప్రతిష్టాత్మక "మూడవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" లో ప్రత్యేక ఆహ్వానితులైన ప్రముఖ సాహితీవేత్తల చేతుల మీదుగా, సభాముఖంగా జరుగుతుంది. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం.

“నా మొట్టమొదటి కథ” - విభాగం విజేతలు

"తల్లి కాకి-పిల్ల కాకి" – "చిలుకూరి సత్యదేవ్", Houston, TX. ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"సంస్కారం"- కాంతి పాతూరి, Dublin, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"నారదభక్తి సూత్రాలు"- శ్రీమతి మణి న్యాయపతి, Atlanta, GA (ప్రశంసాపత్రం)

"రాధా-కృష్ణ” - జయదశ్రీ కల్లూర్, Overland Park, KS (ప్రశంసాపత్రం)

“నా మొట్టమొదటి కవిత” - విభాగం విజేతలు

"అంత:కరణ" -రమణి విష్ణుభొట్ల, Austin, TX ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"నీకు దూరంగా" -ప్రియాంక మిరియంపల్లి, Farmington Hills, MI ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"28390 హౌరా మైల్" – నసీమ్ షైక్, Dallas, TX (ప్రశంసాపత్రం)

"చిరునామా"- సుశ్మిత శ్రీరామ్, Rancho Cordova, CA (ప్రశంసాపత్రం)

ఉత్తమ కథానిక విభాగం విజేతలు

"వీసా" - మహేష్ శనగల, Muncie, IN, ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"స్నేహం-ప్రేమ - పి.వి. భగవతి, Lawrenceville, NJ ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"జాతక చక్రం"- అపర్ణ గునుపూడి మునుకుట్ల – Palo Alto, CA (ప్రశంసాపత్రం)

"అవసరం- వెల్చేరు చంద్ర శేఖర్ – Ethiopia (ప్రశంసాపత్రం)

"తోటలోకి రాకురా" - రేణుకా అయోల -Houston, TX (ప్రశంసాపత్రం)

ఉత్తమ కవిత విభాగం విజేతలు

"సంభవామి యుగే, యుగే" - స్వాతి శ్రీపాద, Union City, CA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

""ముద్దుల బాధ్యత ఒక రక్షణ కంకణం-నారాయణ గరిమెళ్ళ, Reston, VA ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

"అస్తమయం” - మూర్తి మధిర, Portland, OR (ప్రశంసాపత్రం)

"నేనెవర్ని దేవుణ్ణి ప్రశ్నించడానికి"- మద్దూరి శివప్రసాద్, - Poplar Buff, MO (ప్రశంసాపత్రం)


స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీలో పాలొన్న వారందరికీ మరొక్క సారి మా ధన్యవాదాలు. తెలుగులో వ్రాస్తూనే ఉండండి. మంచి అనుభూతిని పొందండి.





















2 comments:

Anonymous said...

I must take this fitting oppertunity to send my hearty compliments to Vanguri Foundation of America.I remember a dialogue in film "Sankara Bharanam" , where it is mentioned even if one in one crore makes efforts to spread telugu culture,language,poems,dance it becomes live for generations.

So,I salute Vanguri Foundation of America, by bending my head.

Let me also wish the foundation a very happy "Khara Naama" UGADI.

Regards
Ramakrishna Koppaka

వంగూరి చిట్టెన్ రాజు said...

ఏదో మేస్ఠారూ, తెలుగు కోసం చాలా మంది తంటాలు పడుతున్నారు...వాళ్ళలో నేను కూడా ఒక్కణ్ణి. ....మీ స్పందనకీ, మంచి మాటలకీ మా ధన్యవాదాలు...

---వంగూరి చిట్టెన్ రాజు