ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరినీ దు:ఖసాగరంలో ముంచి, ఫిబ్రవరి 24, 2011 నాడు పరమపదించిన ముళ్ళపూడి వెంకట రమణ గారితో సంస్థాగతంగానూ, నాకు వ్యక్తిగతంగానూ పెనవేసుకున్న అనుబంధం ప్రగాఢమైనది. వాటిల్లో అతి ముఖ్యమైనదీ, తెలుగు సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టంగా గుర్తింపబడ్డదీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా జనవరి 1, 2007 నాడు హైదరాబాదులో నిర్వహించిన బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి మహోత్సవం. సుమారు వంద మంది రచయితల ప్రసంగాలతో రెండు రోజుల పాటు దిగ్విజయంగా జరిగిన "మొట్ట మొదటి ప్రపంఛ తెలుగు సాహితీ సదస్సు" లో జరిగిన ఈ సన్మానంలో మొట్టమొదటి సారిగా బాపు-రమణ ల సతీమణులు కూడా పాల్గొనడం ఒక అపురూపమైన విశేషం అయితే, అప్పుడు "జ్ఞాన పీఠ" అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి గారి ప్రసంగం "న భూతో న భవిష్యతి". ఈ సత్కారానికి స్పందన గా స్నేహం అంటే ఏమిటో నిర్వచిస్తూ చేసిన ముళ్ళపూడి గారి క్లుప్తమైన ప్రసంగం వారి ఉన్నతమైన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
ఆ వివరాలు ఈక్రింది వీడియో లింకులలో చూడండి.
బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి మహోత్సవం (January 1, 2007)
http://vangurifoundation.org/videos/1stTeluguL/Sanmanam.html
ఆ నాటి చరిత్రాత్మకమైన సాహితీ సదస్సుకు గుర్తింపుగా "ఈ టీవీ" వారి ప్రత్యేక ప్రసారం
http://vangurifoundation.org/videos/1stTeluguL/ETV.html
స్వర్గీయ కోవెల సంపత్కుమారాచార్య, కాళీపట్నం రామారావు గారు, ఎల్లూరి శివారెడ్డి, చాట్ల శ్రీరాములు మొదలైన ప్రముఖుల ప్రసంగాలు:
http://vangurifoundation.org/videos/1stTeluguL/Speeches.html
ఫ్రారంభోత్సవ సభ, ప్రసంగాలు
http://vangurifoundation.org/videos/1stTeluguL/Inaugural.html
ముళ్ళపూడి గారూ - వంగూరి ఫౌండేషనూ...వ్యాసాలు ఈ క్రింది లింకులో చదవండి.
http://www.koumudi.net/Monthly/2011/march/march_2011_amerikamarshiyal.pdf
http://www.koumudi.net/Monthly/2011/march/march_2011_vyAsakoumudi_ramana.pdf
బాపు గారికీ, ముళ్ళపూడి వారి కుటుంబానికీ ప్రగాఢమైన సానుభూతితో....

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(హ్యూస్టన్, హైదరాబాదు)
No comments:
Post a Comment