Saturday, February 22, 2014

19వ ఉగాది ఉత్తమ రచనల పోటీ


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

19వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 20, 2014)

గత 18 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "జయ " నామ సంవత్సర ఉగాది (మార్చ్ 31, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 19 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి. విజేతలందరికీ ఈ క్రింద ప్రకటించబడిన నగదు బహుమతి, ప్రసంశాపత్రం ఈ సంవత్సరం మేము నిర్వహించే “నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” లో కానీ,  సముచితమైన ఇతర సాహిత్య వేదికలో కానీ  అందజేయబడతాయి. రచయితలు సూచనలు, నిబంధనలు ఈ ప్రకటన లో పొందు పరచబడ్డాయి.
ప్రధాన విభాగం19 సారి పోటీ
వయస్సు వారైనా, దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని పోటీకి ఆహ్వానిస్తున్నాం.


ఉత్తమ కథానిక(రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

మొట్టమొదటి రచనా విభాగం” -5 సారి పోటీ
కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఐదవ సారి ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం

"నా మొట్ట మొదటి కథ": (రెండు సమాన బహుమతులు):  ఒక్కొక్కటీ:  $116
 "నా మొట్టమొదటి కవిత": (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

 యువతరం విభాగం- తొలి సారిగా ప్రవేశ పెట్టబడిన పోటీ
నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ 
పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.   

ఉత్తమ కథానిక(రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116
                  ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

                 LAST DATE TO RECEIVE ENTRIES: March 20, 2014 
                         
                                అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
·   ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ రెండు ఎంట్రీలు పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
·      తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును. అన్ని రచనలూ కేవలం ఈ-మెయిల్ లో PDF, JPEG లేదా UNICODE లలో మాత్రమే పంపించాలి.   
·         రచయితల అముద్రిత, స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి. యువతరం విభాగంలో పాల్గొనే రచయితలు (18-35 సంవత్సరాల లోపు) తమ వయస్సు  ధృవీకరణ పత్రం కాపీ జతపరచాలి.  
·      బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, ఇతర పత్రికలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి
·         కాపీ రైట్స్ తమవే అయినా, విజేతల నిర్ణయం ప్రకటించే వరకూ (సుమారు మార్చ్ 31, 2014) తమ ఎంట్రీలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
·      విజేతల ఎన్నిక లో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.


How to send Entries
Preferred Method: Soft copies by e-mail (PDF, JPEG, or Unicode to:
Sairacha2012@gmail.com and copy to       OR By Fax: 1-866 222 5301

For any additional details, please contact any of the following

                                   Chitten Raju Vanguri
                                    Phone: 832 594 9054
                E-mail: vangurifoundation@gmail.com
Sai Rachakonda
Phone: 281 235 6641




Tuesday, December 10, 2013

అమెరికా తెలుగు పుస్తక సమాఖ్య -2013

అమెరికా తెలుగు పుస్తక సమాఖ్య -2013
నమస్కారం,
మీ అందరి ప్రోద్బలంతో ఈ సంవత్సరం మేము నిర్వహించిన 18వ ఉగాది ఉత్తమ రచనల పోటీ,  పన్నెండు ‘నెల నెలా తెలుగు వెన్నెల” సాహితీ సదస్సులు, గత నెల హైదరాబాదు లో వారం రోజుల పాటు అత్యంత విజయవంతంగా నిర్వహించిన “మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం” మొదలైన సాహిత్య కార్యక్రమాలకి పరాకాష్టగా ఈ 2013 లో మా సంస్థ ప్రచురించిన పుస్తకాలు అన్నీ అమెరికా తెలుగు పుస్తక సమాఖ్య – 2013 ద్వారా మీకు అందుబాటు లోకి తేవడమే ఈ ప్రకటన సారాంశం. అమెరికాలో మంచి తెలుగు పుస్తకాలు చదవాలనే అభిలాష ఉన్న పాఠకులకు శ్రమ లేకుండా వారి ఇంటికే పుస్తకాలు పంపించి తెలుగు పఠనాసక్తిని పెంపొందించడమే మా లక్ష్యం. పన్ను రాయితీ కలిగిన చిన్న మొత్తంలో 2013  వార్షిక సభ్యత్వ రుసుము చెల్ల్లించిన సభ్యులకు మాత్రమే మా తాజా ప్రచురణలు అందజెయ్యబడతాయి. లాభాపేక్ష లేకుండా కేవలం ముద్రణ, ఇండియానుంచి ఓడ లోను, విమానంలోను పుస్తకాల రవాణాకి అయిన ఖర్చులు, ఈ సంవత్సరం నిర్వహించిన వివిధ సాహితీ సదస్సుల నిర్వహణ ఖర్చులకి నిమిత్తమే మీ విరాళం వెచ్చించడం జరుగుతుంది. ఉత్తర అమెరికా రచయితలూ, సాహితీ వేత్తలూ, తెలుగు భాష మరియు సాహిత్యాభిమానులూ అమెరికా తెలుగు పుస్తక సమాఖ్య – 2013  సభ్యులుగా చేరి మంచి తెలుగు పుస్తకాలు ఇంటికే తెప్పించుకుని, చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాం. 1994 నుంచీ, లాభాపేక్ష లేని వంగూరి ఫౌండేషన్ ఆప్ అమెరికా వారి సాహిత్య సేవ లో ఈ పుస్తక సమాఖ్య మరొక యత్నం. సాహిత్య కార్యక్రమాలే కాక ఈ సంవత్సరం వేగేశ్న ఫౌండేషన్ వారి వికలాంగుల సేవాశ్రమానికి అమెరికాలో నిధుల సేకరణ నిమిత్తం 24 సంగీత కార్యక్రమాలు, కాకినాడ లోని పి.ఆర్. కాలేజీలో బీద విద్యార్ధులకి మధ్యాహ్న భోజన పథకానికి నిధుల సేకరణ చేసి పున: ప్రారంభానికి సహాయం చెయ్యడం మొదలైన ధార్మిక కార్యక్రమాలు కూడా విజయవంతంగా నిర్వహించాం.    
2013 సంవత్సరానికి వార్షిక సభ్యత్వం సూచనలు
మీ ఆసక్తిని బట్టి, ఈ క్రింది సభ్యత్వాలలో దేనికైనా నమోదు చేసుకోవచ్చును.
 సాహితీ స్రష్ట సభ్యత్వం: US$ 250.00
(కనీసం $350 విలువ గల పుస్తకాలూ, సీడీలు మీకు అందుతాయి. పోస్ట్ ఖర్చులు కూడా మావే.)
 
భాషాభిమాన సభ్యత్వం:  US $ 116.00
(కనీసం $200 విలువ గల పుస్తకాలూ, సీడీలు మీకు అందుతాయి. పోస్ట్ ఖర్చులు కూడా మావే.)
Your Annual membership Donation is Tax-Deductible in USA.  
Membership Benefits -2013
(కేవలం 116 మందికి మాత్రమే ఈ సంవత్సర సభ్యత్వం అందుబాటు లో ఉంటుంది)
అందరూ అందుకునే అపురూపమైన తెలుగు పుస్తకాలు – మా 2013 ప్రచురణలు
1. "వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన 116 అమెరికామెడీ కథలు” 
(“అమెరికా హాస్య బ్రహ్మ“గా పేరొందిన వంగూరి చిట్టెన్ రాజు విరచిత అలనాటి, ఈనాటి పునర్ముద్రిత, అముద్రిత సమగ్ర హాస్య కథా సంకలనం, బాపు గారి ముఖ చిత్రంతో, “గట్టి అట్ట” తో, సుమారు 500 పేజీలు. 
విడి ప్రతి :  $100 (2013 ప్రచురణ.)
2.  “విదేశీ కోడలు”-  అమెరికా రచయిత్రి, సుప్రసిద్ద నర్తకి శ్రీమతి కోసూరి ఉమా భారతి (Houston, TX) తొలి సారిగా రచించిన  ఆసక్తికరమైన 12  కథల సంపుటి . విడి ప్రతి: $25.00 (2013 ప్రచురణ)
3. “అవంతీ కళ్యాణం” – అమెరికా నేపధ్యంలో శ్రీమతి లలిత రామ్ (దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కుమారులు బుజ్జాయి గారి కుమార్తె, పోర్ట్ లాండ్ అమెరికా నివాసి) గారి తొలి సాంఘిక నవల, 260 పేజీలు, విడి ప్రతి   $25.00 (అక్టోబర్, 2013 ప్రచురణ.)
4.  “మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సదస్సు” సభా విశేష సంచిక. సెప్టెంబర్ 29-నుండి అక్టోబర్ 5, 2013 వరకూ వారం రోజులు దిగ్విజయంగా జరిగిన ఈ సాహితీ సదస్సులో 15-35 వయో పరిమితి గల   సుమారు 150 మంది యువతీ యువకులు చదివిన కవితలు, వ్యాసాల సంకలనం.  సుమారు 200 పేజీలు. వెల: $25.00 (అక్టోబర్ , 2013 ప్రచురణ.)
5.  కనీసం $25 విలువ చేసే ఒక “అన్నమయ్య”  పాటల సీడీ, ప్రత్యేకంగా ఎంపిక చేసిన మరికొన్ని తెలుగు పుస్తకాలు.
Special Bonus
  1. All donors of $250 (సాహితీ స్రష్ట) or more will receive the following book as a special bonus. 
"20 వ శతాబ్దంలో అమెరికా తెలుగు కథానిక మరియు అమెరికా సాహితీవేత్తల పరిచయ గ్రంధం" (Valued at $100.00)
(అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ చారిత్రాత్మక గ్రంధంలో ఉత్తర అమెరికానుంచి 1964 లో వెలువడిన మొట్ట మొదటి తెలుగు కథ తో కలిపి, గత శతాబ్దంలో ఉత్తర అమెరికాలో ప్రచురించబడిన వందలాది కథలని నిశితంగా పరిశీలించి, ప్రత్యేకంగా ఎన్నిక చేసిన 116 మంచి తెలుగు కథలు, గత శతాబ్దంలో అమెరికాలో తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేసిన 116 సాహితీవేత్తల ఫొటోలతో కూడిన జీవిత విశేషాలు.- 2009 ప్రచురణ.
 
How To Become a Member of “America Telugu Pustaka Samakhya -2013”
Suggested Donation Options: $250 or $116

On-Line: Visit www.vangurifoundation.blogspot.com , Click on DONATE Button and follow prompts.

  Payment by Check:  Please make check payable to VFA and mail to   
    Vanguri Foundation of America
     P.O.BOX 1948
       STAFFORD, TX.  77497

Payment by Phone (USA) : Please call me on 832 594 9054 with the following      information. 

  Amount:         

Credit Card # ______________________________

Expiry Date: _______/_______                     CVV ________

For more details, please contact Vanguri Chitten Raju (Phone 832 594 9054)



Thursday, October 3, 2013

వైభవోపేతంగా ప్రారంభం

వైభవోపేతంగా ప్రారంభం
మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం
సెప్టెంబర్ 29 - అక్టోబర్ 5, 2013
వేదిక: శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడ్ పల్లి, హైదరాబాద్
నిర్వాహకులు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, సౌజన్యం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ
మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం ఈ రోజు సాయంత్రం (సెప్టెంబర్ 29, 2013- ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకి అత్యంత పవిత్రమైన శ్రీ సరస్వతీ దేవీ ప్రాంగణం లా తీర్చిదిద్దబడ్డ  శ్రీ త్యాగరాజ గాన సభ వేదిక పై అత్యంత వైభవంగా, ఆత్మీయ వాతావరణంలో ప్రాంరంభం అయింది. తెలుగు నాట యువత నుండి అనూహ్యమైన వచ్చిన స్పందన కేంద్ర బిందువుగా తెలుగు సాహిత్య చరిత్రలో యువతరానికి మాత్రమే పరిమితమైన సాహిత్య వేదికకు తొలి సారిగా రూపకల్పన చేసిన ఈ సాహితీ సదస్సుకు 15-35 వయోపరిమితిలోని యువ సాహితీవేత్తలు, వారికి ఆశీస్సులు అందించి ప్రోత్సహించి, వారి సాహిత్య స్పందనను ఆస్వాదించడానికి వచ్చిన  సర్వసాధారణలు, కేవలం సహృదయులూ అయిన తెలుగు భాషాభిమానులతో  సభాప్రాంగణం క్రింద అంతస్తు  పూర్తిగా నిండిపోయి, పై అంతస్తు కూడా సగం పైగా నిండిపోయింది.  

ముందుగా యువ గాయని గీతాంజలి వ్యాఖ్యాతగా సుప్రసిద్ద్ధ లలిత సంగీత గాయకులు కె. రామాచారి (లిటిల్ మ్యుజీ షియెన్స్ ఎకాడెమీ) కుమారుడు సాకేత్ కొమాండూరి నిర్వహణలో యువగాయనీ గాయకులు మంచి లలిత సంగీత గేయాలని వీనులవిందుగా ఆలపించారు. ఆ తరువాత జరిగిన ప్రారంభ మహోత్సవంలో  జ్జానాపీఠ్బహుమతి గ్రహీత డా. నారాయణ రెడ్డి గారు, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎండ్లూరి శివారెడ్డి గారు, డా. కవిఅతా ప్రసాద్ గారు, డా. ద్వానా శాస్త్రి గారు, వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని ఈ సభ క్లుప్తంగా సభ ప్రధాన ఉద్దేశ్యాల గురించి సముచితంగా మాట్లాడారు. తరువాత ప్రారంభం అయిన స్వీయ కవితా విభాగం, యువ కవి సమ్మేళనం, ప్రాచీన సాహిత్యాంలపై ప్రసంగాలలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన 20  మంది యువతీయువకులు తమ పాల్గొన్నారు. కృష్ణ మోహన్ :ఒకే ఒక వాక్యం’, బత్తుల రామకృష్ణ, అవధానుల మణిబాబు మొదలైన వారి కవితలు, పానుగంటి శేషుకళ, లక్ష్మీ మానస, గంగిశెట్టి లక్ష్మీ నారాయణల ప్రసంగాలు  బాగా ఆకట్టుకున్నాయి. ఈ వేదికలన్నింటినీ సమర్ధవంతంగా, చక్కటి తెలుగులో, చతురోక్తులతో నిర్వహించిన గంగిశెట్టి లక్ష్మీ నారాయణ
డా. సినారె చే జ్యోతి ప్రజ్వలన 

మొట్ట మొదటి యువ సాహితీ వేదిక 

అందరి ప్రశంసలను అందుకొన్నారు. రేపటి నుండీ అక్టోబర్ 5 దాకా జరిగే ఈ మహా సభలకి ప్రతీ రోజూ సాయంత్రం 5 నుండి జరిగే ఈ యువ సాహితీ సభలకు అందరూ ఆహ్వానితులే.