Saturday, February 22, 2014

19వ ఉగాది ఉత్తమ రచనల పోటీ


వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

19వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 20, 2014)

గత 18 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "జయ " నామ సంవత్సర ఉగాది (మార్చ్ 31, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 19 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి. విజేతలందరికీ ఈ క్రింద ప్రకటించబడిన నగదు బహుమతి, ప్రసంశాపత్రం ఈ సంవత్సరం మేము నిర్వహించే “నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” లో కానీ,  సముచితమైన ఇతర సాహిత్య వేదికలో కానీ  అందజేయబడతాయి. రచయితలు సూచనలు, నిబంధనలు ఈ ప్రకటన లో పొందు పరచబడ్డాయి.
ప్రధాన విభాగం – 19 వ సారి పోటీ
ఏ వయస్సు వారైనా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.


ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

“మొట్టమొదటి రచనా విభాగం” -5 వ సారి పోటీ
కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఐదవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం. 

"నా మొట్ట మొదటి కథ": (రెండు సమాన బహుమతులు):  ఒక్కొక్కటీ:  $116
 "నా మొట్టమొదటి కవిత": (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

 యువతరం విభాగం- తొలి సారిగా ప్రవేశ పెట్టబడిన పోటీ
ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ 
పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.   

ఉత్తమ కథానిక:  (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116
                  ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $58

                 LAST DATE TO RECEIVE ENTRIES: March 20, 2014 
                         
                                అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
·   ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ రెండు ఎంట్రీలు పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
·      తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును. అన్ని రచనలూ కేవలం ఈ-మెయిల్ లో PDF, JPEG లేదా UNICODE లలో మాత్రమే పంపించాలి.   
·         రచయితల అముద్రిత, స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి. యువతరం విభాగంలో పాల్గొనే రచయితలు (18-35 సంవత్సరాల లోపు) తమ వయస్సు  ధృవీకరణ పత్రం కాపీ జతపరచాలి.  
·      బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, ఇతర పత్రికలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. 
·         కాపీ రైట్స్ తమవే అయినా, విజేతల నిర్ణయం ప్రకటించే వరకూ (సుమారు మార్చ్ 31, 2014) తమ ఎంట్రీలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
·      విజేతల ఎన్నిక లో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.


How to send Entries
Preferred Method: Soft copies by e-mail (PDF, JPEG, or Unicode to:
Sairacha2012@gmail.com and copy to       OR By Fax: 1-866 222 5301

For any additional details, please contact any of the following

                                   Chitten Raju Vanguri
                                    Phone: 832 594 9054
                E-mail: vangurifoundation@gmail.com
Sai Rachakonda
Phone: 281 235 6641




No comments: