Wednesday, September 30, 2015

యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు




యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ లో తెలుగు విభాగం పెంపుదలకి శాశ్వత నిధి ఏర్పాటు
మీ సహకారానికి విన్నపం
(దయ చేసి అక్టోబర్ 15, 2015 లోగా స్పందించండి.)
ఉత్తర అమెరికాలో కొత్త తరాలు తమ పిల్లలకి తెలుగు భాషా, సంస్కృతుల పైన మక్కువ కలిగించే ప్రయత్నాలు ప్రతీ చోటా తెలుగు పాఠశాలలు, నాట్య శిక్షణాలయాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అధిక భాగం ఔత్సాహిక స్థాయిలో నిర్వహించడంలో కృతకృత్యులవుతున్నారు. కానీ తీరా ఆ పిల్లలు హైస్కూల్ దాటి ఉన్నత విశ్వ విద్యాలయాలలో అడుగు పెట్టగానే కేవలం “బాలీవుడ్” సంస్కృతికి తప్ప ఆ  తల్లిదండ్రులు కష్టపడి వేసిన ఆ భాషా పరమైన మౌలికమైన పునాదులని పటిష్టం చేసుకునే అవకాశాలు కల్పించడంలో అమెరికా తెలుగు సమాజం, జాతీయ స్థాయి తెలుగు సంఘాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు కానీ అటు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలకీ, ప్రజలకీ భాషా, సాహిత్యం, సాంస్కృతిక పెంపుదలపై ఉన్న నిర్లిప్తత  ఎంతో బాధాకరం. అందు వలన వారి నుంచి కూడా ఏమీ ఆశించకుండా అమెరికాలో మన ప్రయత్నాలు మనమే చేసుకోవాలి.
ఈ నేపధ్యంలో అమెరికాలో యువతరానికి కేవలం తెలుగు భాష, సాహిత్య, సంస్కృతులపై అవగాహన, మునుపెరగని అభిలాష  ఉన్నత విశ్వ విద్యాలయ స్థాయిలో కూడా కలిగించడం ద్వారానూ, మన ప్రాచీన, ఆధునిక సాహిత్యాలని, భాషా శాస్త్రాన్ని  ఇతర భాషా కోవిదులతో సరి సమానంగా, సగర్వంగా చాటుకోగల సంస్థాగత నిర్మాణాల ద్వారానూ  తెలుగు భాష మహోజ్జ్వలంగా మనుగడ సాగిస్తుంది అని విజ్ఞుల అభిప్రాయం.  అప్పుడే తెలుగు భాష అంతర్జాతీయ భాషలలో సముచిత స్థానాన్ని పొందడమే కాకుండా మన తెలుగు యువ తరం వారి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, వ్యక్తిగత  అవసరాలు ఈ పరాయి దేశంలో సముచితమైన స్థాయిలో నెరవేరుతాయి. ఇంగ్లీషులో కాక మంచి తెలుగులో విన్నా, చదివినా  మన వారసత్వ సంపద అయిన  ఆధ్యాత్మిక సిద్ధాంతాలు, భారత, బాగవత, రామాయణాది పురాణ గాధలూ, ఉన్నత సాంప్రదాయాలు యువతరాలకి సరి అయిన అవగాహన కల్పిస్తాయి. ఈ దిశలో,  తెలుగు రాజకీయ, సామాజిక, వర్గ విభేదాలకి అతీతంగా అత్యున్నత స్థాయి అమెరికా విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రణాళిక తో మేము తలపెట్టిన ఒక చిన్న ప్రయత్నానికి మీ నైతిక ప్రోద్బలం, ఆర్ధిక సహాయం అర్థించడమే ఈ ఉత్తరం సారాంశం.  
గత ఇరవై ఏళ్ళకి పైగా తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదల పై దృష్టి కేంద్రీకరించి, మాకు  ఉన్న పరిమితులకి లోబడి, కేవలం మీ బోటి తెలుగు భాషా, సాహిత్యాభిమానుల ప్రోద్బలమే ఇంధనంగా చెప్పుకోదగ్గ విజయాలు సాధించడమే “వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” కి ఉన్న ఏకైక అర్హత.  దానికి కొనసాగింపుగా ఆస్టిన్ లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్, ఆస్టిన్ వారి తెలుగు విభాగం అభివృద్దికి ఒక “శాశ్వత నిధి” (Program Endowment in Telugu Studies)  సమకూర్చడానికి ఆ విశ్వవిద్యాలయ అధికారులతో సూత్రప్రాయంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ శాశ్వత నిధుల నిర్వహణ పూర్తిగా ఆ విశ్వ విద్యాలయం అధికారుల చేతులలోనే ఉంటుంది, దాని పై ఏటా వచ్చిన ఆదాయం మొత్తం అక్కడి తెలుగు విభాగం ఖర్చులకి, పెంపుదలకి మాత్రమే శాశ్వత ప్రాతిపదిక మీద వినియోగించబడుతుంది. 
ఇటీవల హ్యూస్టన్ లో జరిగిన “పాడుతా తీయగా” కార్యక్రమ వేదిక పై గాన గంధర్వులు డా. ఎస్.పి. బాల సుబ్రమణ్యం ఈ శాశ్వత నిధి ఏర్పాటు గురించి తొలి సారిగా ప్రకటించి ప్రశంసించారు.  
యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ (ఆస్టిన్) లాంటి అత్యత్తమ స్థాయి విశ్వవిద్యాలయం లో గత యాభై ఏళ్ల కి పైగా నడుస్తున్న తెలుగు విభాగం అభివృద్దికి మీ వంతు కర్తవ్యంగా ఈ శాశ్వత నిధి కి మీ ఆర్ధిక సహకారం అందించి, యువతరానికి మన తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులపై అవగాహన, అభిరుచి ఒక విశ్వ విద్యాలయ స్థాయిలో, తగిన ఎకడమిక్ క్రెడిట్స్ పొందే అవకాశం కల్పించమని కోరుతున్నాం.
             మీ అండదండలతో పౌర నిధుల సేకరణ ద్వారా తగిన ఆర్ధిక వనరులు సమకూర్చగలిగితే అమెరికా  విశ్వవిద్యాలయాలలో ఉన్న తెలుగు ఆచార్యులు కలిసి, మెలిసి ఇతర ప్రపంచ, భారతీయ భాషా శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పండితుల సహవాసంతో మన భాషా శాస్త్రం, ప్రాచీన & ఆధునిక సాహిత్య విషయాలపై పరిశోధనలు జరిపి, ఉన్నత స్థాయి అనువాదాలని ప్రచురించి, నిజమైన అంతర్జాతీయ భాషా సదస్సుల  ద్వారా తెలుగు భాషకి ప్రపంచ భాషలలో తగిన గుర్తింపు లభించే  దీర్ఘకాలిక  ప్రయోజనాలు  కూడా సమకూరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 
Brief History & Background of University of Texas Telugu Studies Department
University of Texas, Austin which was established in 1883 and is one of the highest rated Universtites in USA with over 50000 students from around the world.  
The first Telugu course was taught in 1960 and Hindi-Telugu Center at UT was established in 1961. Later on, It was changed to South Asia Center which is one of earliest such Institutes in North America. The person who made all this happen and ran this Insitute until 1990 is Ms. Andre’e F. Sjoberg. She is now 91 years old and lives in West campus of UT. And beleive it not, she procured 7859 Telugu books which are now available in UT, Austin Library making it one of the world’s largest Telugu Libraries out side of India. A few years back, TANA undertook a major intiative and gifted a substantial amount of money to bring it to the current dynamic status
At the present time, UT Telugu Studies Department is one of the largest and most active in USA, under the able leadership of Prof. Afsar Mohammed, a well known Telugu poet & literary critic. Per our information, over 450 students graduated from the Telugu Department in the last few years with an average enrollment of 50 students in several credit courses. It is unfortunate that  enrollment was denied last year for many more enthusiastic students for lack of supporting funds.  
UT, Austin offers eight credit courses to learn Telugu reading, writing and spoken language,  modern Telugu literature including short story & poetry.  UT also teaches Annamayya devotional music and classical music of Tyagaraja and other great  composers. All these prorgams attract not only Telugu heritage students but also non-Telugu students from main stream other ethnic groups.   The Telugu Students formed a separate student body for themselves called Telugu Students  Association which is very active with about 50 members.
యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ వారి సహకారం, అదనపు ఆర్ధిక వనరులతో ఈ శాశ్వత నిధి వలన చేకూరే కొన్ని సత్ఫలితాలు
·         ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్న యువత సంఖ్యని 50 నుంచి పెంచి అందరికీ అవకాశం కలిగించడం.
·         ప్రాచీన, ఆధునిక సాహిత్యం, తెలుగు కథ, కవిత్వం మొదలైన ప్రక్రియలపై పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడం.
·         తెలుగు భాషా శాస్త్రం, సాహిత్యాలపై మాస్టర్స్ మరియు డాక్టరేట్ స్థాయి కి విస్తరణ.
·         ఉన్నత స్థాయి పరిశోధనలకి, ప్రచురణలకి అవకాశాలు కల్పించడం.
·         విశ్వ విద్యాలయ స్థాయిలో అన్నమయ్య సంకీర్తనలు, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ, అవగాహన పెంపొందదించడం.
·         తెలుగు సంస్కృతి, శాస్త్రీయ నృత్యాలపై విశ్వ విద్యాలయ స్థాయి పాఠ్యాంశాలు నెలకొల్పడం.
·         ఉత్తమ తెలుగు సాహిత్యాన్ని ఆంగ్ల, తదితర భాషలోకి అనువదించి అంతర్జాతీయ సాహిత్యంలో తగిన గుర్తింపు కి కృషి చెయ్యడం.  
·         పై అంశాలలో విషయాలలోనూ నిష్ణాతుల ప్రత్యేక ప్రసంగాలని (Endowment Lectures) ఏర్పాటు చెయ్యడం.
·         వివిధ దేశాల విశ్వ విద్యాలయాల తెలుగు ఆచార్యులు, విద్యార్థులు ఇతర భాషా, సాహిత్యవేత్తల తో అంతర్జాతీయ స్థాయిలో వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ తెలుగు భాషా, సాహిత్యాల పురోగతికి తోడ్పడడం.
ఈ విషయాల ఆచరణ లో మీ సలహాలనూ, ఆలోచనలనూ స్వాగతిస్తున్నాం.
Request for Tax-deductible Support for Permanent Endowment Fund
Telugu Studies, Department at Univeristy of Texas, Austin
The main purpose of creating the Endowment Fund is to support Telugu Studies Department on a permanent basis. Vanguri Foundation of America, Inc has made an initial committment of $25,000 to be donated directly to UT, Austin. Further endowment funds may be donated as needed to meet the permanent and specific needs such as Annual Endowment Lectures, Academic Conferences and to meet some of the above lsited objectives.   We plan to sign the Endowment Contract in a few days. This is the first time a permanent Endowment is being established where the funds will be invested by UT Endowment Management, and use the returns exclusively for Telugu Studies. The donated funds for Endowment can never be spent, only invested by UT.
We request your generous tax-deductible financial support as follows: Please help us raise $25000 by October 15, 2015. All donations are tax-deductible in USA.
Grand Benefactor (సార్వభౌమ పోషకులు): $10000
Grand Patron (చక్రవర్తి పోషకులు): $5000
Chief Benefactor (మహారాజ పోషకులు): $2500 ­
Chief Patron (రాజ పోషకులు): $1000
Benefactor (యువరాజ పోషకులు):  $500
Patron (పోషకులు):  $250
 All other donations are respectfully accepted. Major donors will be acknowledged per UT policies.
$100  పై బడి విరాళం ఇచ్చిన దాతలందరికీ ప్రస్తుతం ముద్రణ లో ఉన్న మా 60 వ ప్రచురణ  “కలికి కథలు”
(వెంపటి హేమ గారి 50 కథల సమగ్ర సంపుటి – 600 పేజీలు) మా కృతజ్జతా పూర్వక బహుమతిగా అందిస్తాం.   

Special Note on Matching Donations from Major Corporate Employers
Please note that Vanguri Foundation of America, Inc. has been approved to receive matching donations from many major companies in USA such as Google, Microsoft, Bank of America, Union Bank, Chevron, Microsoft, Dell, Intel, BP, Baker-Hughes, General Electric and others. We appreciate your contacting your empolyer for matching procedures and help double the impact of your own generous donations. Please contact us for details.

CONVENIENT OPTIONS ON HOW TO DONATE
On-Line with any credit card
Please log in or copy or paste the following in your URL and follow prompt.


or visit www.vangurifoundation.blogspot.com, click on DONATE button on right and follow prompt.
By Check
·         CHECK Payable to VFA, write “UT, Austin Fund” in Memo section  and mail to
Vanguri Foundation of America, Inc. P.O. Box 1948, Stafford, TX 77497
For More Information, Please contact
వంగూరి చిట్టెన్ రాజు
vangurifoundation@gmail.com, Phone: 832 594 9054


Please respond by October 15, 2015

No comments: