వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
19వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు
మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 20, 2014)
గత 18 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ,
రాబోయే "జయ " నామ సంవత్సర ఉగాది (మార్చ్ 31, 2014) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 19 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు
రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం.
స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి. విజేతలందరికీ ఈ
క్రింద ప్రకటించబడిన నగదు బహుమతి, ప్రసంశాపత్రం ఈ సంవత్సరం మేము నిర్వహించే
“నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” లో కానీ,
సముచితమైన ఇతర సాహిత్య వేదికలో కానీ
అందజేయబడతాయి. రచయితలు సూచనలు, నిబంధనలు ఈ ప్రకటన లో పొందు పరచబడ్డాయి.
ప్రధాన విభాగం – 19 వ సారి పోటీ
ఏ
వయస్సు వారైనా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $58
“మొట్టమొదటి రచనా విభాగం” -5 వ సారి పోటీ
కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఐదవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
"నా మొట్ట మొదటి కథ": (రెండు సమాన బహుమతులు): ఒక్కొక్కటీ: $116
"నా మొట్టమొదటి కవిత": (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $58
యువతరం విభాగం- తొలి సారిగా ప్రవేశ పెట్టబడిన పోటీ
ఈ
నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ
పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $58
LAST DATE TO RECEIVE ENTRIES: March 20, 2014
LAST DATE TO RECEIVE ENTRIES: March 20, 2014
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
· ఒకే రచయిత ఒక్కొక్క
ప్రక్రియకూ రెండు ఎంట్రీలు పంపించవచ్చును. వ్రాత
ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా
ఉండాలి.
· తమకు నచ్చిన
ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును. అన్ని
రచనలూ కేవలం ఈ-మెయిల్ లో PDF, JPEG లేదా UNICODE లలో మాత్రమే పంపించాలి.
·
రచయితల అముద్రిత, స్వీయ
రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత
బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో
ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత
పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీ లో
పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి. యువతరం
విభాగంలో పాల్గొనే రచయితలు (18-35 సంవత్సరాల లోపు) తమ వయస్సు ధృవీకరణ పత్రం కాపీ జతపరచాలి.
· బహుమతి పొందిన
రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net
లోనూ, ఇతర పత్రికలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
·
కాపీ రైట్స్ తమవే అయినా, విజేతల నిర్ణయం ప్రకటించే వరకూ (సుమారు మార్చ్ 31, 2014) తమ ఎంట్రీలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
· విజేతల ఎన్నిక
లో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
How to send Entries
Preferred Method: Soft copies by e-mail (PDF,
JPEG, or Unicode to:
Sairacha2012@gmail.com and copy to
OR By Fax: 1-866 222 5301
For
any additional details, please contact any of the following
Chitten
Raju Vanguri
Phone:
832 594 9054
|
Sai Rachakonda
Phone: 281 235 6641
|