Sunday, August 25, 2013

మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం


సాదర ఆహ్వానం
మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం
సెప్టెంబర్ 29- అక్టోబర్ 5, 2013
ప్రతీ రోజూ సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా వారం రోజుల పాటు
వేదిక: శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడ్ పల్లి, హైదరాబాద్
నిర్వాహకులు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
(ప్రసార మాధ్యమాల సహకారం: ఈ-టీవీ, ఈ నాడు పత్రిక)  
యువ తరం తెలుగు భాష, సాహిత్యాభిమానులకు సాదర ఆహ్వానం
తెలుగు సాహిత్య ప్రపంచంలో బహుశా మొట్టమొదటి సారిగా, కేవలం యువతీ యువకులకు ప్రాధాన్యత కలిగిస్తూ వారిదే అయిన ఒక సాహిత్య వేదికను ఆవిష్కరిస్తూ జరుగుతున్న "మొట్టమొదటి జాతీయ యువ సాహితీ సమ్మేళనం" లో పాల్గొనమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
ప్రభుత్వ విద్యా విధానాలలో చెప్పరాని నిర్లక్ష్యంఉద్యోగావకాశాలకి ఆంగ్లం మాత్రమే అవసరం అనే కాకుండా తెలుగు ప్రతిబంధకం అనే అపోహతో తెలుగు భాషని విస్మరిస్తున్న, తిరస్కరిస్తున్న మధ్యతరగతి సమాజం, దిగుమతి చేసుకున్న “సంకర” సంస్కృతినే తెలుగు సంస్కృతిగా ప్రచారం చేస్తున్న ప్రసార మాధ్యమాల ప్రభావం మొదలైన అనేక కారణాల వలన అపురూపమైన మన భాషా సాహిత్యాలకి తగిన గౌరవం, గుర్తింపు రోజు రోజుకి మరుగై పోతున్నాయి అని అందరికీ తెలిసినదే!
తరుణంలో, తెలుగు భాషా, సాహిత్యాలకి వెన్నెముకగా నిలిచి, భవిష్యత్తుని దేదీప్యమానంగా చేద్దామని తపన పడుతున్నది కొంతమంది వయోధికులే అయినా తెలుగు భాషా సాహిత్యాలను, తద్వారా మన సంస్కృతిని కాపాడే గురుతర బాధ్యత నాటి యువతరానిదే. అందువలన కళాశాల విద్యార్ధులూ, 15-35 సంవత్సరాల వయస్సు గల యువ రచయితలూ, కవులూ, సాహిత్యాభిలాషులూ, తెలుగు భాషను జీవనోపాధిగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్న వారు మాత్రమే వేదిక మీద ప్రసంగాలతోనూ, చర్చా వేదికలలోనూ పాల్గొనే అపురూప సమ్మేళనానికి వయస్సు తో నిమిత్తం లేకుండా అందరూ ఆహ్వానితులే. రాజకీయపరమైన ప్రాంతీయ వాదోపవాదాలకు, సామాజిక సమస్యల చర్చలకు వేదికలో తావు లేదు. కేవలం భాష, సాహిత్యాల విషయాలకే వేదిక పరిమితం.

సమ్మేళన ప్రధాన ఉద్దేశ్యాలు
1. తెలుగు యువ రచయితలు, సాహిత్యాభిలాషులూ తెలిసిన స్నేహితులతోబాటు అనేక ప్రాంతాలనుంచి వచ్చే తోటి వారిని కలుసుకుని, సాహిత్యపరంగా ముచ్చటించుకోవడం. కొత్త పరిచయాలు పెంచుకోవడం. తెలుగు భాషా, సాహిత్యాలపై తమ మక్కువ చాటుకోవడం.
2. యువతరం తెలుగు రచయితలు తమ స్వీయ రచనలను సభాముఖంగా వినిపించి ఇతరులతో పంచుకోడం.
3. అన్నింటికంటే ప్రధానంగా, తెలుగు సాహిత్యం విషయంలో ప్రస్తుత సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించుకోడం.
4. భవిష్యత్తులో భాష మనుగడకి, సాహిత్య పోషణకీ మంచి మార్గాలు నిర్దేశించుకోడం.
యువ వక్తలకు ఆహ్వానం, విన్నపం
సాహిత్యపరమైన విషయాలపై ప్రసంగించి, తమ అభిప్రాయాలను ఇతర రచయిత్రులూ, సాహిత్యాభిమానులతో పంచుకోవాలని అభిలషించే తెలుగు యువతీ యువకులందరికీ (వయస్సు పరిమితి 15-35) సమ్మేళనం ఒక ప్రత్యేక సాహిత్య వేదిక. క్ర్ంద ప్రచురించబడిన "ప్రాధమిక కార్యక్రమ వివరాలు" పత్రంలో సూచించబడిన ప్రసంగాంశాలు మాత్రమే ఆమోదయోగ్యం. సమ్మేళనంలో ప్రసంగించదల్చుకుంటే మీ పేరు, చిరునామా, ఫోన్, -మెయిల్ లతో సాహిత్యపరమైన పూర్తి ప్రసంగం మాకు తెలియవలసిన ఆఖరి తేదీ సెప్టెంబర్ 1. 2013. అన్ని విషయాలలోనూ తుది నిర్ణయం నిర్వాహకులదే. ప్రసంగీకులందరూ తమ వయస్సు నిర్ధారించే పత్రం (బర్త్ సర్టిఫికేట్, స్కూల్ పత్రాలూ మొదలైనవి) కాపీ కూడా మాకు విధిగా పంపించాలి. ఎటువంటి వయో ధృవీకరణ పత్రమూ జతపరచని ప్రతిపాదనలు/అభ్యర్ధనలు పరిశీలించబడవు.
ప్రత్యెక సూచనలు, నిబంధనలు
1.  సెప్టెంబర్ 1. 2013 లోపుగా మాకు అందిన వ్యాసాలలో మేము పరిశీలించి ఎంపిక చేసుకున్న వాటికి మాత్రమే ప్రసంగించే అవకాశం కలిగించబడుతుంది.
2.  వక్తకైనా వేదిక పై ప్రంసంగావకాశం వారం రోజులలోనూ ఒక్క సారే ఇవ్వబడుతుంది.
3. హైదరాబాద్ నివాసులైన స్థానిక వక్తలకు రూ. 500 పారితోషికం, ఇతర ప్రాంతాల వారికి
రూ.1116.00 పారితోషికం ఇవ్వబడతాయి.
4. ప్రయాణ మరియు వసతి ఏర్పాట్లు, ఖర్చుల బాధ్యత ప్రసంగీకులదే.

వక్తలు తమ వ్యక్తిగత వివరాలను (పేరు, చిరునామా. ఫోన్ నెంబర్, -మెయిల్ మరియు వయస్సు ధృవీకరణ పత్రంసెప్టెంబర్ 1. 2013 లోపుగా క్రింది చిరునామాకు పంపించాలి.
“Sromani” Vamsee Ramaraju, Managing Trustee
Vanguri Foundation of America
Satya Sai Puram, Survey No: 139 (part)
Kuntloor, Hayatnagar Mandal, R.R. Dist.
Hyderabad -501505, A.P

దాతలకు విన్నపం
లాభాపెక్ష లేని ఈ మొట్టమొదటి యువతరం సాహిత్య సమ్మేళనం నిర్వహణ కి సుమారు రెండు లక్షల రూపాయల వ్యయం అవుతుందని మా అంచనా. కేవలం ఆ ఖర్చుల నిమిత్తం సాహితీ ప్రియులైన పెద్దల విరాళాలు అర్దిస్తున్నాం.
రూ. 1500 విరాళం ఇచ్చిన దాతలందరికీ రూ. 900 విలువ గల "వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన నూట పదహారు అమెరికామెడీ కథలు" పుస్తకంతో బాటు సుమారు రూ. 2500 విలువ గల మా ఇతర ప్రచురణలు బహూకరించబడతాయి. 
Please donate any amount by using the DONATE button located under the logo in the right hand corner of this web page.  
ప్రాధమిక కార్యక్రమ వివరాలు, ప్రసంగాంశాలు
ప్రతీ రోజూ 5:00 గంటలనుండి 10:00 గంటల వరకూ
(ప్రతీ రోజూ పుస్తక ప్రదర్సన ఉంటుంది)
సెప్టెంబర్ 29, 2013 (ఆదివారం)
ప్రారంభ వేదిక, పుస్తకావిష్కరణలు, స్వీయ పద్యపఠనం, ప్రాచీన సాహిత్యం, అవధాన ప్రక్రియపై  ప్రసంగాలు.
సెప్టెంబర్ 30, 2013 (సోమవారం)
యువతుల కవి సమ్మేళనం, హాస్య కవి సమ్మేళనం, అనగనగా ఒక  కథ (ఐదు నిమిషాలలో కథ చెప్పాలి), ఆధునిక కథ, నవల, నాటకాలపై ప్రసంగాలు.
అక్టోబర్  1, 2013 (మంగళవారం)
లలిత సంగీతం, స్వీయ వచన కవితా పఠనం, ఆధునిక కవిత, అనువాద సాహిత్యాలపై ప్రసంగాలు.
అక్టోబర్  2, 2013 (బుధవారం)
జానపడం పాటలు, స్త్రీల పాటలు, జానపఫా సాహిత్యం, జానపద కళారూపాలపై ప్రసంగాలు.
అక్టోబర్  3, 2013 (గురువారం)
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ సవాళ్ల పై ప్రసంగాలు, పండుగలు, నోములు, స్థానిక ప్రదేశాలు, చారిత్రక స్థలాలపై చర్చ.
అక్టోబర్  4, 2013 (శుక్రవారం)
సినిమాలు, ప్రసార మాధ్యమాలపై ప్రసంగాలు, ప్రపంచీకరణ ప్రభావం, అంతర్జాలం బ్లాగులు మొదలైన వాటి పాత్ర పై చర్చ.
అక్టోబర్  5, 2013 (శనివారం)
భాషా, సాహిత్య సంస్కృతులపై క్విజ్ పోటీ, యువత కొత్త రచనల పుస్తకావిష్కరణలు. ముగింపు సభ.
 ఈ చారిత్రక యువ సాహితీ సమ్మేళనం పూర్తీ వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి.
డా. తెన్నేటి సుధా దేవి
Cell: 92465 77745
డా. ద్వా. నా. శాస్త్రి
Cell: 98492 93376
డా. వంగూరి చిట్టెన్ రాజు (Houston, TX, USA)
Phone: 832 594 9054




  

  

  


No comments: