Wednesday, February 6, 2013

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా - 18వ ఉగాది ఉత్తమ రచనల పోటీ



వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

18వ ఉగాది ఉత్తమ రచనల పోటీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం

గత 17 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే "విజయ " నామ సంవత్సర ఉగాది (ఏప్రిలు 11, 2013) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 18 వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం.

18 వ " విజయ " ఉగాది ఉత్తమ రచనల పోటీ విజేతలకి ప్రశంసాపత్రాలతో బాటు ఈ క్రింది విధంగా నగదు పారితోషికాలు ఇవ్వబడతాయి.
ఉత్తమ కథానిక(రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116

అంతే కాక కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ క్రింది ప్రక్రియలలో ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం  లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూతన కథకులనూ, కవులనూ, కవయిత్రులనూ  ఈ "పోటీ" లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం
"నా మొట్ట మొదటి కథ": (రెండు సమాన బహుమతులు):  ఒక్కొక్కటీ:  $116
 "నా మొట్టమొదటి కవిత": (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ:  $116
అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
·   ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
·      తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
·        రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథ" మరియు "మొట్టమొదటి కవిత" పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
·      బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు www.koumudi.net లోనూ, "రచన" మాస పత్రిక (హైదరాబాదు) లోనూ, ఇతర పత్రికలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి
·        కాపీ రైట్స్ తమవే అయినా, విజేతల నిర్ణయం ప్రకటించే వరకూ (సుమారు ఏప్రిల్ 11, 2013) తమ ఎంట్రీలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
·      విజేతల ఎన్నిక లో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is:  March 10, 2013

 
 


How to send Entries

Preferred Method: Soft copies by e-mail (PDF or Gautami fonts in Unicode attachments preferred) to: 
Sairacha2012@gmail.com and copy to

By Fax: 1-866 222 5301

By Postal/Snail Mail:
Vanguri Foundation of America
P.O. Box 1948
Stafford, TX 77497

For any additional details, please contact any of the following

Chitten Raju Vanguri
Phone: 832 594 9054
Sai Rachakonda
Phone: 281 235 6641

No comments: